ఆర్కే నగర్‌లో దినకరన్ గెలుపు: బీజేపీ వ్యతిరేక ఓటు కాదు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఘోర పరాభవం అని వార్తలు వచ్చాయి.

చదవండి: దినకరన్ గెలుపు వెనుక: అన్నాడీఎంకేకు 'మోడీ' దెబ్బ: శశికళ వీడియో 'గేమ్', జైలు నుంచే చక్రం

అంతేకాదు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, హిందీ భాషను బలవంతంగా రుద్దడం, వైద్య కళాశాల ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ లాంటి నిర్ణయానికి ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారని కొందరు వ్యాఖ్యానించారు.

RK Nagar results not against voting BJP

అయితే ఇది బీజేపీకి వ్యతిరేక ఓటు కాదని అంటున్నారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రతిపక్ష డీఎంకేకే డిపాజిట్ దక్కలేదని గుర్తు చేస్తున్నారు.

డబ్బు ప్రవాహం కారణంగానే దినకరన్ గెలిచారని విపక్షాలు చెబుతున్నాయి. దినకరన్ ఎన్నికల కోసం రూ.వంద కోట్లు గుమ్మరించారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఈ నెల మొదట్లోనే ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This is one record the BJP candidate who contested the RK Nagar bypoll will not be proud of, as NOTA got more votes than he did.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి