అహ్మద్ పటేల్ గెలుపు: నితీష్‌కు ఝలక్, శరద్ యాదవ్ బిగ్ స్టెప్

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూలో చీలిక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

జెడియు నేత, సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే వైపు మొగ్గుతుండగా, జెడియూ అధినేత శరద్ యాదవ్ యూపీఏ వైపు ఉన్నారు. ఇప్పటికే పలు అంశాల్లో వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ రాజ్యసభ ఎన్నికలలోను అది కనిపించింది.

థ్యాంక్ గాడ్, గెలిచాం: సోనియా, పరువు పోరులో అమిత్ షా ఓటమి

నితీశ్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న శరద్‌ యాదవ్‌ సొంత కుంపటి పెట్టే దిశగా సాగుతున్నారు. జేడీయూను చీల్చి తన మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టే దిశగా సాగుతున్నట్టు తెలుస్తోంది.

Sharad Yadav Takes Big Step Forward In Plans To Split With Nitish Kumar

తాజాగా గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ అహ్మద్ పటేల్‌కు అభినందలు తెలుపడం ద్వారా శరద్‌ యాదవ్‌ ఈ దిశగా పెద్ద ముందడుగు వేశారని భావిస్తున్నారు.

ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను చిత్తు చేస్తూ అహ్మద్ పటేల్‌ విజయం సాధించారు. గెలిచిన వెంటనే అహ్మద్‌కు శరద్‌ అభినందనలు తెలిపారు. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్‌ పటేల్‌ గెలుపొందారంటూ ఆయనతో తాను దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tuesday's dramatic Gujarat Rajya Sabha election has fast tracked a break up in Bihar, where Chief Minister Nitish Kumar and his senior colleague in the Janata Dal (United) Sharad Yadav are now inexorably headed for a split. They have been building up to it for some time now.
Please Wait while comments are loading...