షాకింగ్ .. ప్రజా కోర్టు నిర్వహించి మరీ సొంత కమాండర్ ను హతమార్చిన మావోయిస్ట్ లు
చత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సొంత కమాండర్ ని హతమార్చిన సంఘటన చర్చనీయాంశంగా మారింది . బస్తర్ రేంజి ఐజి ఈ ఘటనను ధృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఒకపక్క మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ దళాలు వేట సాగిస్తున్న వేళ మావోయిస్టులు సొంత పార్టీ కమాండర్ లానే హతమార్చటం గమనార్హం .
బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియాలో ఈ మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులను మావోయిస్టులు హత్యలు చేస్తున్నారనే వార్తలు వెలుగులోకి రావడంతో, మావోయిస్టు అగ్రనాయకత్వం దండకారణ్యం జోన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. హత్య ఘటనల వెనుక పూర్వాపరాలు శోధించి ప్రజా కోర్టు నిర్వహించి అనంతరం స్థానిక డివిజన్ ఏరియా కమిటీ ఇంచార్జీ, కమాండర్ విజా మోడియం అలియాస్ బద్రును దోషిగా నిర్ధారించింది.

గ్రామస్తుల హత్యలు ఉద్దేశ్య పూర్వకంగా బద్రు ఏకపక్షంగా స్వంత నిర్ణయాలు తీసుకుని తనకు వ్యతిరేకంగా వున్న వారిని చంపాడనే అభియోగంతో మావోయిస్టులు తమ సొంత కమాండర్‌నే హతమార్చారు. మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా పేరు గాంచిన విజాను గంగులూరు మరియు కిరాండుల్ మధ్య ఎటావర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు హత్య చేసినట్లు సమాచారం. మావోయిస్టులు విజాను హతమార్చిన అనంతరం అర్ధరాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా సమాచారం. సొంత గ్రామం మంకెలీలో మావోయిస్టు కమాండర్ విజా అంతక్రియలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది.
అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మావోయిస్టు నాయకుడు, డివిసి ఇంచార్జ్ గంగులూరు ఏరియా కమిటీ విజా మోడియం అలియాస్ బద్రు వయసు 34 సంవత్సరాలు. అతను బీజాపూర్ జిల్లా గంగులూరు సమీపంలోని మంకెలి గ్రామస్థుడు. మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ సభ్యుడు .
Recommended Video
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications