బాబోయ్.. బెంగళూరు ట్రాఫిక్ తో ఠారెత్తిన భారత వ్యోమగామి..!!
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ జామ్ అనేది సర్వసాధారణం ఇక్కడ. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాలకు వైపు వెళ్లే మార్గాల్లో ప్రైవేట్ బస్సుల వల్ల రాత్రిళ్లు కూడా హెవీగా వాహనాల రాకపోకలు స్తంభించిపోతుంటాయి. దీనిదెబ్బకు కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ కార్యలయాలను ఇతర ప్రాంతాలు, నగర శివార్లకు రీలొకేట్ అయిన సందర్భాలు సైతం లేకపోలేదు.
ఇదే ట్రాఫిక్.. వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను చిరాకు పెట్టింది. అసహనానికి గురి చేసింది. బెంగళూరు టెక్ సమ్మిట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు.. దీనికి ప్రతిబింబించాయి. బెంగళూరు ట్రాఫిక్‌లో ప్రయాణించడం కంటే అంతరిక్షానికి వెళ్లడం చాలా సులభమని శుభాంశు శుక్లా సెటైర్లు వేశారు. మార్తహళ్లి నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వరకు 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి తనకు గంటకు పైగా పట్టిందని అన్నారు.

ఈ టెక్ సమ్మిట్ లో తాను ఇవ్వదలిచిన ప్రజెంటేషన్ సమయం కంటే మూడు రెట్లు అధికమని సెటైర్లు వేశారు. మార్తహళ్లి నుంచి ఎగ్జిబిషన్ సెంటర్ కు రావడంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. నిర్దేశిత సమయానికి ఆయన చేరుకోలేకపోయారు. దీనికి గల కారణాలను ఆయన వెల్లడించారు. తాను మారతహళ్లి నుంచి ఇక్కడికి వచ్చానని, ఈ చిన్న ప్రజెంటేషన్ కోసం కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ టైమ్.. ట్రాఫిక్ లోనే గడిచిపోయిందని పేర్కొన్నారు.
ఇంతసేపు ట్రాఫిక్ లో ఉండటానికి ఈ ప్రజెంటేషన్ ఇవ్వడంపై తనకు ఉన్న అంకితభావం అలాంటిదని నవ్వుతూ చెప్పారు. శుభాంశు శుక్లా చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతరిక్షం నుంచి బెంగళూరుకు రావడం సులభమేనని, మారతహళ్లి నుంచి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ కు రావడం కష్టమేనని ప్రియాంక్ ఖర్గే అంగీకరించారు.
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కర్ణాటక ప్రభుత్వం టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు ప్రతిపాదించింది. అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటై హెబ్బాళ నుంచి సిల్క్ బోర్డ్ జంక్షన్ వరకు సుమారు 17 కిలోమీటర్ల దూరం మేరకు ఈ టన్నెల్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నిర్ణయించింది. ఇది వివాదాస్పదంగా మారింది. ఈ టన్నెల్ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతుందని, బెంగళూరులోని పలు చెరువులు దెబ్బతింటాయని అంటున్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications