• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు సూర్యగ్రహణం, సూర్య, చంద్ర గ్రహణాలు కాకుండా వేరే గ్రహణాలు కూడా ఉంటాయా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వలయాకార గ్రహణం

గ్రహణాలను కనువిందు చేసే ఖగోళ ఘటనలుగా చెప్పవచ్చు. అందుకే గ్రహణాలు చూడాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా పర్యటక రంగమే పుట్టింది.

2021లో చివరి సూర్యగ్రహణం ఇవాళ (డిసెంబర్ 4న) ఏర్పడబోతోంది. దక్షిణార్థగోళంలోని అనేక దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుందని నాసా చెబుతోంది. కానీ భారత్‌లో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదు. దక్షిణార్థగోళంలో భారత్ లేకపోవడమే దీనికి కారణమని నాసా తెలిపింది.

ఖగోళ అద్భుతాలుగా చెప్పుకునే రకరకాల గ్రహణాల్లో ఇదొకటి.

"సాధారణంగా చంద్ర గ్రహణాలు లేదా సూర్య గ్రహణాలు అనే రెండు రకాల గ్రహణాలు ఉంటాయి" అని చిలీ అటానమస్ యూనివర్సిటీలో సైన్స్ కమ్యూనికేషన్ సెంటర్‌లో ఖగోళ శాస్త్రజ్ఞుడు యువాన్ కార్లోస్ బీమిన్ ఆయన పుస్తకం "ఇల్లస్ట్రేటెడ్ ఆస్ట్రానమీ" అనే పుస్తకంలో రాశారు.

కానీ, సాంకేతికంగా చూస్తే, రెండు నక్షత్రాలతో కూడుకున్న మరో మూడవ రకం గ్రహణం కూడా ఉంది" అని రాశారు.

గ్రహణాల్లో రకాలేంటి?

సూర్య గ్రహణం

సూర్య గ్రహణాలు

కొన్ని సార్లు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి, భూమికి మధ్యలో ప్రయాణిస్తాడు. దాంతో, సూర్యుని నుంచి వచ్చే కాంతికి ఆటంకం కలుగుతుంది. అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

మరో మాటలో చెప్పాలంటే, భూమి ఉపరితలం పై చంద్రుని నీడ పడుతుంది.

కానీ, సూర్య గ్రహణాల్లో కూడా మూడు రకాలు ఉన్నాయి. ఇవి చంద్రుడు సూర్యునిలో ఎంత భాగాన్ని కప్పాడు అనే విషయాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి.

సంపూర్ణ సూర్య గ్రహణం

సంపూర్ణ సూర్య గ్రహణం

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకదానితో ఒకటి సమాంతరంగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు.

కొన్ని నిమిషాలు లేదా సెకండ్ల పాటు ఆకాశం చీకటిగా మారిపోయి, రాత్రిని తలపిస్తుంది.

"ఖగోళంలో జరిగే అరుదైన మార్పుల వల్లే సంపూర్ణ సూర్య గ్రహణాలు ఏర్పడతాయి. సూర్యుడు చంద్రుని కంటే 400 రెట్లు వెడల్పుగా, 400 రెట్లు దూరంగా ఉంటాడు. అంటే ఈ అమరిక పరిపూర్ణంగా వచ్చినప్పుడు, సూర్యుని ఉపరితలాన్ని చంద్రుడు కప్పేస్తాడు. దాంతో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది" అని నాసా వివరించింది.

భూమి ఉపరితలం చుట్టూ ఏర్పడిన చంద్రుని నీడను సూచించే గీతను "పాత్ ఆఫ్ టోటాలిటీ" (సంపూర్ణ మార్గం) అని అంటారు. ఆ చిన్న ప్రదేశంలోనే ఈ సంపూర్ణ చీకటి కనిపిస్తుంది.

ఈ మార్గం ఇరు వైపులా కొన్ని వేల కిలోమీటర్ల వరకూ, ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. ఈ మార్గానికి దూరంగా ఉన్నవారికి చంద్రుడు సూర్యున్ని కప్పిన భాగం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.

"ఇది ఎంత సేపు ఉంటుందనేది, భూమి సూర్యుని నుంచి, చంద్రుడు భూమి నుంచి ఉన్న దిక్కు పై, భూమి పై ఏ భాగంలో ఎక్కువ చీకటి ఆవరించిందనే అంశం పై ఆధారపడి ఉంటుంది" అని బీమిన్ రాశారు.

"సైద్ధాంతికంగా అత్యంత సుదీర్ఘమైన సూర్య గ్రహణం 7 నిమిషాల 32 సెకండ్ల పాటు ఉంటుంది" అని చిలీ ఖగోళ శాస్త్రజ్ఞుడు తెలిపారు.

అవి ఊహించినంత అరుదుగా వచ్చేవేమి కావు. ప్రతీ 18 నెలలకొకటి వస్తూనే ఉంటుంది.

కాకపొతే, సంపూర్ణ సూర్య గ్రహణం ఒకే చోట నుంచి మళ్లీ కనిపించదు. ఇది సగటున 375 సంవత్సరాలకొక్కసారి జరుగుతుంది.

ఈ ఏడాది డిసెంబరు 04న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ, దానిని అంటార్కిటికా నుంచి మాత్రమే పూర్తిగా వీక్షించగలం.

వలయాకార గ్రహణం

సూర్య గ్రహణాలు

చంద్రుడు భూమి నుంచి దూరంగా ఉన్నప్పుడు, పూర్తిగా సూర్యుని ఉపరితలాన్ని కప్పినప్పుడు, చాలా చిన్నగా కనపడతాడు.

దాంతో, చంద్రుని చుట్టూ ఒక రింగ్ ఆకారంలో ఉన్న సూర్యుడు కనిపిస్తాడు. దీనినే వలయాకార సూర్య గ్రహణం అంటారు.

సంపూర్ణ సూర్య గ్రహణంలో లాగే, ఇక్కడ కూడా "పాత్ ఆఫ్ ఆన్యులారిటీ" (వలయాకార మార్గం) ఉంటుంది. ఇందులో గహణం ప్రతి సారీ వలయాకారంలో కనిపిస్తుంది. ఈ మార్గానికి ఇరు వైపులా పాక్షికంగా గ్రహణం కనిపించే ప్రదేశం కూడా ఉంటుంది.

జూన్ 10న ఏర్పడే వలయాకార గ్రహణం భూమికి ఉత్తరాన ఉన్నకెనడాలో కొన్ని ప్రాంతాలు, గ్రీన్ ల్యాండ్, రష్యాలో పూర్తిగా కనిపిస్తుంది. యూరోప్‌లో చాలా భాగాలు, మధ్య ఆసియా, చైనాలో పాక్షిక గ్రహణం కనిపిస్తుంది.

ఈ గ్రహణాలు సుదీర్ఘ సమయం ఉంటాయని, ఈ వలయాన్ని 10 నిమిషాలకు పైగా చూడవచ్చని నాసా చెబుతోంది. కానీ, సాధారణంగా ఈ గ్రహణాలు 5 లేదా 6 నిమిషాలు మించి ఉండవు.

హైబ్రిడ్ గ్రహణం

హైబ్రిడ్ గ్రహణం

"చంద్రుడు సూర్యున్ని పూర్తిగా కప్పగలిగేంత దూరంలో ఉన్నప్పటికీ, అది ప్రయాణం చేస్తుండగా, భూమి నుంచి కాస్త పక్కకు తప్పుకుని, సూర్యున్ని కప్పడం మానేస్తుంది. దాంతో, అది వార్షిక గ్రహణంగా మారిపోతుంది" అని బీమిన్ వివరించారు.

"ఇది వలయాకార గ్రహణంగా మొదలై, కాస్త దగ్గరగా వచ్చి సంపూర్ణ గ్రహణంగా మారవచ్చు" అని అన్నారు.

"హైబ్రిడ్ గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయి. మొత్తం సూర్యగ్రహణాల్లో వీటి శాతం కేవలం 4 శాతం మాత్రమే ఉంటుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డి ఆస్ట్రోఫిజీషియ డి కనారియస్ పేర్కొంది.

2013 లో హైబ్రిడ్ గ్రహణం ఏర్పడినట్లు నాసా సమాచారం చెబుతోంది. ఇలాంటి ఇంకొక గ్రహణాన్ని చూడటానికి ఏప్రిల్ 20, 2023 వరకు వేచి చూడాలి. ఇది ఇండోనేసియా, ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా నుంచి కనిపిస్తుంది.

సంపూర్ణ చంద్ర గ్రహణం

చంద్ర గ్రహణాలు

సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు కాంతిని నిరోధించడం వల్ల చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

చంద్ర గ్రహణ సమయంలో భూమి నీడను చంద్రుని ఉపరితలం పై చూస్తాం.

"పరిశీలకులు ఉండే భౌగోళిక ప్రాంతాన్ని బట్టీ సూర్యగ్రహణాలు కనిపిస్తాయి. చంద్ర గ్రహణాల్లో ఇందుకు వ్యతిరేకంగా, గ్రహణం సమయంలో చంద్రుడు ఆకాశంలో కనిపిస్తున్నప్పుడు భూమి మీద నుంచి ఎక్కడి నుంచైనా దీనిని పరిశీలించవచ్చు" అని ఐఏసి లో ఒక టీచింగ్ గైడ్ వివరించారు.

"సూర్యగ్రహణంలో దశలు మారడం పరిశీలకులు చూసే భౌగోళిక ప్రాంతం పై ఆధారపడి ఉంటే, చంద్రగ్రహణంలో దశలు మాత్రం ఎక్కడి నుంచి చూసినా కూడా ఒకేలా ఉంటాయి" అని చెప్పారు.

చంద్ర గ్రహణాల్లో మూడు రకాలున్నాయి

సంపూర్ణ చంద్ర గ్రహణం

సంపూర్ణ చంద్ర గ్రహణం

సంపూర్ణ చంద్ర గ్రహణ సమయంలో చంద్రుడు, సూర్యుడు భూమికి వ్యతిరేకంగా ఉంటారు.

"చంద్రుడు భూమికి నీడలా ఉన్నప్పటికీ కూడా కొంత సూర్యకాంతి మాత్రం భూమిని చేరుతుంది" అని నాసా తెలిపింది.

"ఈ సూర్యకాంతి వాతావరణం లోంచి భూమికి ప్రయాణిస్తూ నీల వర్ణపు కాంతిని వడకట్టేస్తుంది. అందుకే, ఈ సమయంలో చంద్రుడు ఎర్రని వర్ణంలో కనిపిస్తాడు. దీనినే బ్లడ్ మూన్ అని కొన్ని సార్లు అంటారు" అని నాసా వివరించింది.

చంద్ర గ్రహణం

"భూమి వ్యాసం చంద్రుని వ్యాసం కంటే కూడా నాలుగు రెట్లు పెద్దగా ఉండటం వల్ల దాని నీడ కూడా వెడల్పుగా ఉంటుంది. దాంతో, చంద్ర గ్రహణం 104 నిమిషాల సేపు ఉంటుంది.

ఈ ఏడాది మే 26 న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడింది. ఇది పశ్చిమ దక్షిణ అమెరికా, దక్షిణ తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించింది.

అదృష్టం ఉంటే, "సూపర్ ఫ్లవర్ సంపూర్ణ చంద్రుడి" గ్రహణాన్ని 14 నిమిషాల పాటు చూడవచ్చు.

పాక్షిక చంద్ర గ్రహణం

పాక్షిక చంద్ర గ్రహణం

చంద్రునిలో ఒక భాగం మాత్రమే భూమి నీడను తాకినప్పుడు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

గ్రహణం పరిమాణాన్ని బట్టి నల్లగా మారిన చంద్రుని ఉపరితలం పై ఒక్కొక్కసారి ముదురు ఎరుపు, బొగ్గులా ఉండే బూడిద వర్ణం రంగులో నీడలు కనిపిస్తాయి.

కప్పిన భాగానికి, నీడ వల్ల ప్రభావితం కాని ప్రకాశవంతమైన చంద్రుని ఉపరితలానికి మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల ఇలా కనిపిస్తుంది.

చంద్రగ్రహణం

సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా సంభవించినప్పటికీ, పాక్షిక గ్రహణాలు మాత్రం సంవత్సరానికి రెండు సార్లు జరుగుతాయని నాసా పేర్కొంది.

ఈ ఏడాది నవంబరు 18-19న పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనున్నది. ఇది ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

ఉపచ్ఛాయ చంద్ర గ్రహణం

ఉప ఛాయ చంద్ర గ్రహణం

భూమి ఉప ఛాయ మీదుగా చంద్రుడు ప్రయాణించినప్పుడు ఉప ఛాయ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఇది చాలా తేలికపాటి నీడలా ఏర్పడుతుంది..

ఈ గ్రహణాలు కంటికి కనిపించడం ఈ ఉప ఛాయ పరిధిలోకి వచ్చిన చంద్రుని భాగం పై ఆధార పది ఉంటుంది. ఇది ఎంత చిన్నగా ఉంటే దానిని పరిశీలించడం అంత కష్టం.

అందుకే, ఈ గ్రహణాలు గురించి క్యాలెండర్లలో కూడా ఎక్కడా ప్రస్తావన ఉండదు. ఇవి శాస్త్రవేత్తలు మాత్రమే పరిశీలిస్తారు.

నక్షత్ర గ్రహణాలు

అన్ని గ్రహణాల్లో సూర్యుడు, చంద్రుడు మాత్రమే ఉండరు. దూరంగా ఉండే నక్షత్రాలు కూడా ఒక్కొక్కసారి గ్రహణాలకు కారణమవుతాయి.

"50 శాతం నక్షత్రాలు రెండు లేదా మూడు నక్షత్ర సమూహాల లోపల ఉంటాయి" అని బీమిన్ పుస్తకంలో వివరించారు.

"నక్షత్రమండలంలో చాలా నక్షత్రాలు ఉండటం వల్ల కొన్ని జంట నక్షత్రాలు ( రెండు నక్షత్రాలు ఉండే నక్షత్ర విధానం సాధారణంగా ఉండే సమూహ కేంద్రాన్ని చుట్టుకుని ఉంటాయి) భూమికి అనుసంధానంగా ఉన్న కక్ష్యలో ప్రయాణిస్తూ ఉంటాయి. దాంతో, ఆ కక్ష్యలో ఒక భాగంలో ఒక నక్షత్రం మరొక దానిని అడ్డుకుంటూ దాని మీదుగా ప్రయాణిస్తుంది.

"ఈ నక్షత్రాలనే గ్రహణానికి కారకమయ్యే జంట నక్షత్రాలు" అని అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Solar Eclipse today: Is there any other eclipse apart from Solar and Lunar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X