సునంద పుష్కరమ మృతి కేసు: శశిథరూర్‌కు ఊరట
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో శవపరీక్ష నివేదికను ప్రభావితం చేశారనే ఆరోపణల నుండి థరూర్‌కు ఊరట లభించింది. నివేదిక విషయంలో ఎయిమ్స్ వైద్యుడి పైన ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలను కేంద్ర పాలనా ట్రైబ్యునల్ (క్యాట్) తిరస్కరించింది.
సునంద శవపరీక్ష విషయంలో వృత్తికి విరుద్ధంగా వ్యవహరించనందుకు శిక్షగా తన సినీయారిటీని ఎయిమ్స్ దురుద్దేశ్యపూర్వకంగా తొలగించిందని ఆరోపిస్తూ.. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి సుధీర్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను రాజ్ వీర్ శర్మ, అశోక్ కుమార్‌లతో కూడిన క్యాట్ కొట్టివేసింది.

2014 జనవరి 26వ తేదీన అఫ్పటి వరకు కేంద్రమంత్రి శశిథరూర్ డాక్టర్ రాజీవ్ బాసిన్‌కు ఈ మెయిల్ పంపారని, నోటీసును 2014, జూన్ 2న పంపారని, ఇందులో సునంద కేసులో శవపరీక్ష పైన ప్రభావిత నివేదిక ఇచ్చేలా ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదని క్యాట్ పేర్కొంది.












Click it and Unblock the Notifications