వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెండూల్కర్‌కు ముంబై టెస్టు మ్యాచ్ చివరిదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెస్టు మ్యాచుల నుంచి కూడా తప్పుకావాలనే ఒత్తిడి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకుని, స్వదేశంలో వెస్టిండీస్‌పై రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను ఏర్పాటు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సచిన్ టెండూల్కర్‌కు వీడ్కోలు చెప్పడానికి కూడా సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 198 టెస్టు మ్యాచులు ఆడాడు. మరో రెండు మ్యాచులు ఆడితే 200 టెస్టులు ఆడిన ఘనతను సాధిస్తాడు.

సచిన్ టెండూల్కర్ 200వ మ్యాచ్, టెస్టుల నుంచి రిటైర్మెంట్ ఒకేసారి జరుగుతాయని భావిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ తన 200వ టెస్టు మ్యాచును ముంబైలోని తన సొంత మైదానం వాంఖడేలో ఆడే అవకాశం ఉంది. ఈ మేరకు ముంబై క్రికెట్ సంఘం బిసిసిఐకి విజ్ఞప్తి కూడా చేసింది. సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచుపై నెలకొన్న ఆసక్తి కారణంగానే బిసిసిఐ దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసిందని బాయ్‌కాట్ విమర్శించాడు.

బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడినట్లు, టెండూల్కర్ భవిష్యత్తు ఆలోచనపై సంభాషణ జరిగినట్లు ఒక్కసారిగా ప్రచారం గుప్పుమంది. యువకులకు ఆవకాశం ఇవ్వడానికి వీలుగా టెస్టుల నుంచి తప్పుకోవాలని సందీప్ పాటిల్ సచిన్‌కు సూచించినట్లు వార్తలు వచ్చాయి. వెస్టిండీస్‌పై జరిగే రెండు మ్యాచుల్లో ఆటతీరును బట్టే సచిన్ టెండూల్కర్ టెస్టు మ్యాచుల్లో ఇంకా కొనసాగుతాడా, లేదా అనేది తేలుతుందని అంటున్నారు.

Sachin Tendulkar

ఇటువంటి ప్రచారం ఊపందుకున్న తరుణంలోనే సచిన్ టెండూల్కర్ అనూహ్యంగా నిరుడు డిసెంబర్‌లో అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే, సచిన్ టెండూల్కర్‌కు వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచు ద్వారా ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, తాను టెండూల్కర్‌తో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను సందీప్ పాటిల్ ఖండించారు. తామిద్దరం కలుకోక పది నెలలు దాటిందని ఆయన చెప్పారు.

సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం 40 ఏళ్ల పడిలో పడ్డారు. అయితే, సందీప్ పాటిల్ సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను బిసిసిఐ కూడా ఖండించింది. తాము సచిన్‌తోనూ పాటిల్‌తోనూ మాట్లాడామని, వారిరువురి మధ్య చర్చలు జరగలేదని బిసిసిఐకి చెందిన రాజీవ్ శుక్లా చెప్పారు.

అయితే, బిసిసిఐ రహస్య ఎజెండా మాత్రం కొనసాగుతూనే ఉందనే ప్రచారం సాగుతోంది. వెస్టిండీస్ నవంబర్ పర్యటనను అనుకోకుండా ఖరారు చేసిన తర్వాత పాటిల్ సచిన్ టెండూల్కర్‌ను కలిసినట్లు చెబుతున్నారు. వెస్టిండీస్‌ భారత్‌తో రెండు మ్యాచుల సిరీస్ ఆడనుంది. రెండో మ్యాచు సచిన్ టెండూల్కర్‌కు 200వ మ్యాచ్ అవుతుంది. 200వ మ్యాచు ముగిసిన తర్వాత ఆటతీరును బట్టే టెస్టు మ్యాచుల్లో ఆడడం, ఆడకపోవడం ఉండాలని సందీప్ పాటిల్ సచిన్ టెండూల్కర్‌కు సూచనప్రాయంగా చెప్పినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఏమైనా, ఈ రెండు టెస్టు మ్యాచుల్లో ఆటతీరే సచిన్ టెండూల్కర్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పవచ్చు.

English summary
Sachin Tendulkar's future on Wednesday became a subject of intense speculation after a media report claimed that he has been told to consider his career plans after the milestone game, forcing the BCCI to issue a denial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X