ధర్డ్‌ వేవ్‌పై ఎస్‌బీఐ షాకింగ్‌ రిపోర్ట్‌- సెకండ్‌ వేవ్‌ తరహాలోనే - 98 రోజుల పాటు

కరోనాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం కొనసాగుతుండగానే ఎన్నడూ లేని విధంగా ధర్డ్‌ వేవ్‌పై తీవ్ర చర్చ సాగుతోంది. ఇందులో ఎక్కువగా చిన్నారుల మరణాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో ధర్డ్‌వేవ్‌పై జనం చర్చించుకుంటున్నారు. అయితే సెకండ్‌ వేవ్‌ తరహాలోనే ఇది కూడా తీవ్రంగానే ఉంటుందని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. అయితే సెకండ్ వేవ్‌ నేపథ్యంలో పెరిగిన అప్రమత్తతతో మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉండొచ్చని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది.

 ధర్డ్‌ వేవ్‌పై ఎస్‌బీఐ రిపోర్ట్‌

ధర్డ్‌ వేవ్‌పై ఎస్‌బీఐ రిపోర్ట్‌

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా భారీ ఎత్తుల కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ధర్డ్‌వేవ్‌పైనా చర్చ జరుగుతోంది. ఇది సెకండ్‌ వేవ్‌ కన్నా ప్రమాదకరంగా ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో ఎస్‌బీఐ తాజాగా దీనిపై ఓ అధ్యయనం చేపట్టింది. ఇందులో పలు షాకింగ్‌ అంశాలను బయటపెట్టింది. కరోనా ధర్డ్‌ వేవ్‌ ప్రభావం, దాని లక్షణాలు, ఎన్ని రోజులు ఉండొచ్చన్న అంశాలపై ఎస్‌బీఐ ఇవాళ ఎకోరాప్‌ పేరుతో ఓ నివేదికను వెల్లడించింది. ఇందులో సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే ధర్డ్‌వేవ్ ఎలా ఉండొచ్చన్న అంశంపై సమగ్ర సమాచారాన్ని పొందుపర్చింది.

సెకండ్‌వేవ్‌ తరహాలోనే ధర్డ్‌వేవ్

సెకండ్‌వేవ్‌ తరహాలోనే ధర్డ్‌వేవ్

భారత్‌ను ప్రస్తుతం పట్టి పీడిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌ తరహాలోనే ధర్డ్‌ వేవ్‌ కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపొచ్చని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచనా వేసింది. అంతర్జాతీయ అనుభవాల్ని బట్టి చూస్తే కరోనా ధర్డ్‌ వేవ్‌ కూడా సెకండ్‌ వేవ్‌ కంటే భిన్నంగా ఏమీ ఉండదని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న తరహాలోనే కేసులు, మరణాలు కూడా తప్పవని ఎస్‌బీఐ చెబుతోంది. దీంతో ధర్డ్‌వేవ్‌పైనా అప్రమత్తత అవసరమని చెప్పినట్లయింది.

అప్రమత్తంగా ఉండే మరణాలు తగ్గించొచ్చు

అప్రమత్తంగా ఉండే మరణాలు తగ్గించొచ్చు

కరోనా సెకండ్‌వేవ్‌లో భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ధర్డ్‌వేవ్‌పై మాత్రం ఎస్‌బీఐ రిపోర్ట్‌ ఓ గుడ్ న్యూస్ చెప్పంది. అప్రమత్తంగా ఉండటం ద్వారా ధర్డ్‌వేవ్‌లో మరణాల్ని అరికట్టొచ్చని ఎస్‌బీఐ చెబుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌లో ఇప్పటివరకూ 1.7 లక్షల మరణాలు చోటు చేసుకోగా.. ధర్డ్‌వేవ్‌లో అప్రమత్తంగా ఉండటం ద్వారా మరణాల్ని 40 వేలకు పరిమితం చేయొచ్చని కూడా ఎస్‌బీఐ రిపోర్ట్‌ చెబుతోంది. అంటే మరణాలు ఆపడం సాధ్యంకాదని, కేవలం తగ్గించవచ్చని చెబుతోంది.

98 రోజుల పాటు కరోనా ధర్డ్‌వేవ్

98 రోజుల పాటు కరోనా ధర్డ్‌వేవ్

అంతర్జాతీయ అనుభవాల్ని బట్టి చూస్తే కరోనా ధర్డ్‌వేవ్‌ 98 రోజులు ఉండొచ్చని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేస్తోంది. వివిధ దేశాల్లో ధర్డ్‌వేవ్ ప్రభావం దాదాపు ఇంతే సమయం ఉందని ఎస్‌బీఐ చెబుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్‌ను 108 రోజులు ఉండగా... ధర్డ్‌ వేవ్‌ మాత్రం పది రోజులు తక్కువగా ఉండొచ్చని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే ధర్డ్‌వేవ్‌ పీక్‌ స్ధాయిలో 1.8 రెట్లు ఉండొచ్చని చెబుతోంది. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ 5.2 రెట్లు అధికంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+