వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం జరుగుతోంది: 24 గంటల్లోనే మూడు విమాన ప్రమాదాలు...అన్నీ రన్‌వేపైనే..!

|
Google Oneindia TeluguNews

ఈ మధ్యకాలంలో విమానాయాన సంస్థలు ప్రధాన వార్తల్లో నిలుస్తున్నాయి. విమానాల్లో సిబ్బంది మధ్య గొడవ, ప్రయాణికులు సత్ప్రవర్తన లేకపోవడం, విమాన సిబ్బంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం వంటి ఘటనలతో ఏవియేషన్ రంగం హెడ్‌లైన్స్‌లో నిలిచింది. తాజాగా విమాన ప్రమాదాలతో విమానాయాన సంస్థ వార్తల్లో నిలుస్తోంది. కేవలం 24 గంటల సమయంలో మూడు రన్‌వే ప్రమాదాలు జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ ఆ మూడు ప్రమాదాలు ఎక్కడ జరిగాయి..? ప్రమాదానికి కారణాలేంటి..?

24 గంటల్లో మూడు విమాన ప్రమాదాలు

విమాన ప్రమాదాలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. కొన్ని ఘటనల్లో ఏకంగా ప్రాణాలు పోగా మరికొన్ని ఘటనల్లో ప్రయాణికులకు స్వల్పగాయాలు అవుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా మూడు విమాన ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే మూడు ప్రమాదాలు వేర్వేరు చోట్ల జరిగినప్పటికీ అన్నీ రన్‌వేపై జరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక ప్రమాదానికి గురైనవన్నీ ప్రయాణికులను తీసుకెళ్లే ఎయిర్ ‌క్రాఫ్ట్స్ కావడం విశేషం. ఆదివారం మంగళూరులో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ రన్‌వేపై అదుపు తప్పి భూమిలోకి ఇరుక్కుపోయింది. దుబాయ్‌ నుంచి వచ్చిన బోయింగ్ 737 మంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అవగానే రన్‌వే పై నుంచి పక్కకు పోయింది. అయితే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. వాతావరణం సరిగ్గా లేకపోవడం, బలమైన గాలులు, తడిసిన నేల, బ్రేకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అధికారులు.

సూరత్‌లో రన్‌వేపై నుంచి పక్కకు వచ్చిన స్పైస్ జెట్


ఇక రెండో ప్రమాదం సూరత్‌లో జరిగింది. దేశీయ విమానాయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానం భోపాల్ నుంచి సూరత్‌కు వచ్చింది. ఆదివారం రాత్రి 8:15 గంటల సమయంలో రన్‌వేపై ల్యాండ్ అయి పక్కకు మరలింది. ఆ సమయంలో భారీ వర్షం, బలమైన గాలులు వీచాయని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో సూరత్‌లో దిగాల్సిన మూడు విమానాలను దారి మళ్లించి అహ్మదాబాదులో ల్యాండింగ్ చేశారు.

కోజికోడ్‌లో మూడో విమాన ప్రమాదం

మూడో ప్రమాదం కోజికోడ్‌లో జరిగింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన విమానం కోజికోడ్ విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి పక్కకు మరలింది. ఎయిరిండియాకు చెందిన ఈ విమానం ల్యాండింగ్‌ సమయంలో వెనక భాగం చివర నేలకు తాకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రన్‌వేపై స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి కోజికోడ్‌లో ఈ విమానం ల్యాండ్ అయ్యింది.

English summary
The past 24 hours were scary for Indian aviation with three runway incidents that could have turned into deadly disasters. Three passenger aircraft met with minor accidents at three different airports over the past 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X