labours pension budget loksabha piyush goyal narendra modi central government కార్మికులు పింఛను పెన్షన్ లోక్‌సభ పీయూష్ గోయల్ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం union budget budget 2019 కేంద్ర బడ్జెట్
కార్మికులకు శుభవార్త : నెలనెలా 3వేల పింఛను.. ప్రపంచంలోనే పెద్దది
ఢిల్లీ : అసంఘటిత రంగంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలనెలా పింఛను అందించే విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పింఛను స్కీమ్ గా ఇది గుర్తింపు పొందనుంది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మేరకు.. అసంఘటిత రంగంలోని దాదాపు 10 కోట్ల మందికి ఈ స్కీమ్ కింద లబ్ధి చేకూరనుంది. ఆ మేరకు 60 ఏళ్లు నిండినవారికి నెలనెలా 3వేల రూపాయలు పింఛను అందనుంది.

కార్మికులకు పెద్దపీట
ఈ బడ్జెట్ లో అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. "ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్" పేరిట తెరపైకి తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా.. అసంఘటిత రంగంలోని కార్మికులకు పింఛను ఇచ్చే విధానం ప్రవేశపెట్టింది. 60 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి ఈ స్కీమ్ కింద పింఛను లభించనుంది. ఈ పథకం అమలు చేయడానికి 500 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. ఏప్రిల్ నుంచి అమలు కానున్న ఈ స్కీమ్ ద్వారా దాదాపు 10 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు, ఏ శ్లాబ్‌కు ఎంత పన్ను అంటే?

ఇక నెలనెలా పింఛను
ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పథకం కింద లబ్ధి పొందనున్న కార్మికులు.. నెలనెలా 100 రూపాయల వరకు తమ వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. అలా ఈ పథకం కింద 60 ఏళ్లు నిండినవారికి నెలనెలా 3వేల రూపాయల పింఛను అందనుంది. అటు ప్రభుత్వం కూడా తన వాటా కింద ఒక్కొక్క కార్మికుడి మీద మరో 100 రూపాయల వరకు ఈ పథకంలో జమ చేయనుంది.

20 లక్షలకు గ్రాట్యూటీ.. 6 లక్షలకు ప్రమాద బీమా
కేంద్రం తాజా నిర్ణయంతో అసంఘటిత రంగంలోని కార్మికులపై వరాల జల్లు కురిపించినట్లైంది. నెలనెలా పింఛను ఇచ్చేలా స్కీమ్ రూపొందించడమే గాకుండా
గ్రాట్యూటీ పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచింది. అలాగే కార్మికులకు ఇప్పటివరకు అందుతున్న ప్రమాద బీమా మొత్తాన్ని కూడా పెంచారు. ఇదివరకు ఉన్న
లక్షా యాభై వేల రూపాయల స్థానంలో 6 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తించనుంది.