వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి: విచారణ ప్రారంభం, పోయెస్ గార్డెన్ లో మొదలు, ఆ రోజు రాత్రి ఏం జరిగింది !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై వస్తున్న అనుమానాలపై నిజానిజాలు బయటకు తియ్యడానికి విచారణ మొదలైయ్యింది. మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఏ.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై వస్తున్న అనుమానాలపై నిజానిజాలు బయటకు తియ్యడానికి విచారణ మొదలైయ్యింది. మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఏ. అర్ముగస్వామి బుధవారం విచారణ మొదలు పెట్టారు.

జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం నుంచి విచారణ మొదలైయ్యింది. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి పొద్దుపోయిన తరువాత జయలలితను అపోలో ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఆ రోజు వేదనిలయంలో పని చేస్తున్న వారు ఎవరెవరు ఇంటిలో ఉన్నారు ? అంటూ విచరణ మొదలు పెట్టారు.

జయలలిత స్పహలో ఉన్నారా ? లేదా ?

జయలలిత స్పహలో ఉన్నారా ? లేదా ?

జయలలితను ఆసుపత్రిలో చేర్చించడానికి తీసుకెళ్లిన సమయంలో ఆమె స్పహలో ఉన్నారా ? లేదా ? ఆని విచారణ మొదలు పెట్టారు. అంబులెన్స్ లో జయలలితతో పాటు ఎవరెవరు అపోలో ఆసుపత్రికి వెళ్లారు అని ఆరా తీస్తున్నారు. జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎవరెవరు అక్కడ ఉన్నారు అనే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

 జయలలిత మృతి తరువాత ఎందుకు వచ్చారు

జయలలిత మృతి తరువాత ఎందుకు వచ్చారు

డిసెంబర్ 5వ తేదీ జయలలిత మరణించిన తరువాత పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, జయలలిత మరణించిన తరువాత వారు ఎందుకు ఆ ఇంటికి వచ్చారు ఆనే పూర్తి సమాచారం సేకరించాలని రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి బృందం నిర్ణయించింది.

 అధికారులు ఎవరెవరు కలిశారు ?

అధికారులు ఎవరెవరు కలిశారు ?

సెప్టెంబర్ 22వ తేదీన తమిళనాడు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులు ఎవరెవరు జయలలితను కలిశారు, ఆ సందర్బంలో ఆమె ఆరోగ్యం ఎలా ఉందనే విషయం తెలుసుకోవడానికి అధికారులను విచారణ చెయ్యాలని ప్రత్యేక కమిషన్ నిర్ణయించిందని తెలిసింది.

వైద్యుల విచారణ

వైద్యుల విచారణ

పోయెస్ గార్డెన్ లో జయలలితకు చికిత్స చేసిన వైద్యులు, నర్సులను విచారణ చెయ్యాలని నిర్ణయించారు. అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స చేసిన వైద్యులు అందర్నీ (లండన్, సింగపూర్, ఎయిమ్స్) విచారణ చేసి వారి నుంచి వివరాలు సేకరించాలని నిర్ణయించారు.

 75 రోజులు ఏం జరిగింది ?

75 రోజులు ఏం జరిగింది ?

సెప్టెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జయలలిత విషయంలో ఏం జరిగిందనే పూర్తి సమాచారం తెలుసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం గత నెల 25వ తేదీన రిటైడ్ ఐఏఎస్ అధికారి ఆర్ముగస్వామి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయిస్తోంది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి పూర్తి వివరాలు ఉన్న నివేదికను తమిళ, ఇంగ్లీష్ బాషల్లో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 25న మొదలైన విచారణ మూడు నెలల్లో పూర్తి చేసి నివేదిక సర్పించడానికి సిద్దం అయ్యారు.

English summary
The commission to probe Jayalalithaa’s demise is set to begin its investigation today. The Tamil Nadu government had set up an inquiry commission to probe the death of the former chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X