ఘోర ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మంది మృతి.. 40 మందికి సీరియస్..
ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఆదివారం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న క్రమంలో ఈ దారుణం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారైకుడి సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్న ఘటనలో 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నిలిచిపోయాయి.


ఇక ప్రమాదంలో మృతి చెందిన 11 మందిలో 9 మంది మహిళలే ఉన్నారు. కారైకుడి సమీపంలో తిరుపత్తూరు ప్రాంతంలోని పిల్లయ్రర్ పట్టి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతోంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను బయటకు తీయడంతో పాటు.. బస్సుల్లో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి ముందు ఓ ఆర్టీసీ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకూడికు వెళ్తుండగా.. మరో ఆర్టీసీ బస్సు కారైకూడి నుంచి దిండిగల్ వైపునకు వెళ్తున్నట్లు సమాచారం అందుతోంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications