సుఖేష్ నుంచి కీలక సమాచారం: శనివారమే దినకరన్ అరెస్ట్?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన టివివి దినకరన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందా? అంటే అవుననే అంటున్నారు. పార్టీ గుర్తు 'రెండాకుల' కోసం ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ క్రైమ్ విభాగం పోలీసులు దినకరన్‌కు సమన్లు పంపించారు.

కొత్త ట్విస్ట్: తమిళనాడు సీఎంగా పన్నీరుసెల్వం, పళనికి డిప్యూటీ..?

బుధవారం పొద్దుపోయాక ఆయనకు ఢిల్లీ పోలీసుల నుంచి సమన్లు అందాయి. అసిస్టెంట్ కమిషనర్ సంజయ్‌తో పాటు మరో అధికారి బసంత్ నగర్‌లోని దినకరన్ ఇంటివద్దకు వెళ్లి సమన్లు అందించారు.

దేశం విడిచి వెళ్లకుండా..

దేశం విడిచి వెళ్లకుండా..

కాగా దినకరన్ దేశం విడిచి వెశ్లకుండా ఢిల్లీ పోలీసులు బుధవారం ఆయనపై లుకవుట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దినకరన్ ఎన్నారై కావడం, ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం అందడంతో లుకవుట్ నోటీసులు జారీ చేశారు.

16న చంద్రశేఖర్ అరెస్ట్

16న చంద్రశేఖర్ అరెస్ట్

పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఈ నెల 16న దినకరన్ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఒప్పందం

ఒప్పందం

మొత్తం రూ.50 కోట్లకు డీల్ కుదుర్చుకునే ప్రయత్నం జరిగినట్టు చెబుతుండగా... చంద్రశేఖర్ వద్ద నుంచి రూ.1.3 కోట్ల నగదుతో పాటు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.

కీలక సమాచారం రాబట్టారు

కీలక సమాచారం రాబట్టారు

ఇప్పటికే చంద్రశేఖర్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది. తాజాగా దినకరన్ దర్యాప్తులో చేరనున్నారు. శనివారం దినకరన్‌ను విచారించనున్న పోలీసులు ఆయన చెప్పే సమాధానాలపై సంతృప్తి చెందకుంటే అదేరోజు ఆరెస్టు చేసి, అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran faces arrest, likely to step down after meet with Sasikala.
Please Wait while comments are loading...