రాజమౌళి, ఎన్. శంకర్ సినిమాల తరహాలో ఐటీ శాఖ దాడులు, భయపడం: టీటీవీ దినకరన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలు తిరుగుతూ హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని అరుణాచలేశ్వర ఆలయం, ప్రత్యాంగిరదేవి ఆలయంలో టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులు హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు.

శశికళ ఫ్యామిలీకి షాక్: చిన్నమ్మ బినామి వివేక్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్, ఏం జరుగుతుందో !

అరుణాచలేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు చేసిన టీటీవీ దినకరన్ అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులును రాజమౌళి, ఎన్. శంకర్ సినిమాల తరహాలో చూపించేందుకు 186 ప్రాంతాల్లో సోదాలు చేశారని టీటీవీ దినకరన్ ఎద్దేవ చేశారు.

TTV Dinakaran offer prayer for Prathyangira Devi temple

ఇలాంటి ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులకు తాము భయపడమని, ఎన్ని సమస్యలైనా ఎదుర్కోంటామని టీటీవీ దినకరన్ చెప్పారు. కేంద్రంలోని పెద్దలతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమ్మక్కు అయ్యారని టీటీవీ దినకరన్ ఆరోపించారు.

శశికళ మేనల్లుడి ఆస్తులు చూసి ఐటీ శాఖ దిమ్మతిరిగింది: కేసు ఈడీకి, ఆస్తులు జప్తు చేస్తే ఎలా!

కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారమే ఆదాయపన్ను శాఖ అధికారులతో మా కుటుంబ సభ్యులపై దాడులు చేయిస్తున్నారని టీటీవీ దినకరన్ ఆరోపించారు. జయలలిత వైద్య చికిత్స సమయంలో ఆమె కోరిక మేరకు తీసిన వీడియోలు తన వద్దనే ఉన్నాయని, వాటిని ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లలేదని టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran offer prayer for Prathyangira Devi temple near Tiruvannamalai district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి