బీజేపీ కొత్త అధ్యక్షుడు ఖరారు: మోదీ-షా ఊహించని ఎంపిక..!?
బీజేపీ కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారు అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడు ఎంపిక జరగనుంది. ఇప్పటికే ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షా కొత్త అధ్యక్షుడి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. 2029 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కీలక నియామకాల పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎవరూ ఊహించని విధంగా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. డిసెంబర్ 19న పార్లమెంట్ సమావేశా లు పూర్తయిన వెంటనే నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వేగం పెరగనుంది. 29 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక పార్టీ అధ్యక్షుల ఎంపిక మాత్రమే పెండింగ్‌లో ఉంది.ఆదివారం నాటికి యూపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, కర్ణాటకలో పార్టీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. కాగా.. యూపీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పార్టీ అధ్యక్షుడు కావటం దాదాపు ఖాయంగా మారింది.

అయితే, ఓబీసీ నేతలు పంకజ్ చౌదరి, బీఎల్ వర్మ, సాధ్వీ నిరంజన తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా లక్నో వెళ్లిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి యూపీ బీజేపీ చీఫ్ పదవికి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక, కర్ణాటకలో లింగాయత్ నేత జగదీశ్ శెట్టర్, వక్కలిగ నేత సీటీ రవి పేర్లపై చర్చలు జరుగుతు న్నాయి. ఏకాభిప్రాయం వస్తే కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కూడా త్వరలో పూర్తి కానుంది. కాగా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. తాజాగా బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయం కోసం ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ పోషించారు. అప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయన బీజేపీ గెలుపు కోసం అమలు చేసిన వ్యూహాలు ఫలించాయి.
ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్లు కూడా చర్చలో ఉన్నప్పటికీ ప్రధాన్‌కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరిగే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2027 లో రాష్ట్రపతి ఎన్నికను పరిగణలోకి తీసుకొని ప్రాంతాలు .. సమీకరణాల ఆధారంగా మోదీ- షా ద్వయం నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా.. ధర్మేంద్ర ప్రధాన్ కొత్త బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టటం ఖాయంగా కనిపిస్తోంది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications