నూపుర్ శర్మను హత్య చేసేందుకు వచ్చిన ఉగ్రవాది అరెస్ట్
లక్నో: బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ హత్యకు మరో ఉగ్రవాది కుట్ర పన్నాడు. అయితే, అతడు పోలీసులకు చిక్కాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్).. జైషే మహ్మద్ (జేఎం), తెహ్రీఖ్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాది ముహమ్మద్ నదీమ్‌లను సహరాన్‌పూర్ నుంచి శుక్రవారం అరెస్టు చేశారు.
నదీమ్ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు జెఎమ్, టిటిపితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు. నూపుర్ శర్మను హతమార్చేందుకు జేఈఎం అతడికి పని అప్పగించిందని ఏటీఎస్ తెలిపింది.

స్వాతంత్ర్య దినోత్సవంలో పేలుడుకు ప్లాన్ చేస్తున్న ఐఎస్‌ఐఎస్ కార్యకర్తను ఉత్తరప్రదేశ్‌లోని ఏటీఎస్ అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుందని ఒక అధికారి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం సభ్యుడు, నిందితుడు సబావుద్దీన్ అజ్మీ, ఐఎస్ఐఎస్‌తో సంబంధం ఉన్న ముజాహిదీన్ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో ఇస్లామిక్ స్టేట్‌ను స్థాపించి, షరియా చట్టాన్ని అమలు చేయడానికి ప్రణాళికలో పనిచేస్తున్నాడు.
Uttar Pradesh | Terrorist Muhammad Nadeem was in direct contact with Pakistan-based terrorist outfits JeM & TTP. He was given the task by JeM to kill Nupur Sharma: UP ATS https://t.co/o9EUvPObyh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 12, 2022
అజంగఢ్ జిల్లాలోని ముబారక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీలో నివాసి సబావుద్దీన్‌ను ఏటీఎస్ ప్రధాన కార్యాలయంలో ఏటీఎస్ బృందం అరెస్టు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అజ్మీపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, 1967, 3/25 ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
నిందితుల నుంచి బాంబు తయారీ సామగ్రి, పేలుడు పదార్థాలు, అనేక అక్రమ ఆయుధాలు, కాట్రిడ్జ్‌లను ఏటీఎస్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటన పేర్కొంది.
Recommended Video

ఐఎస్‌ఐఎస్ భావజాలంతో ప్రభావితమైన అజంగఢ్‌కు చెందిన అమిలో ఓ వ్యక్తి జిహాదీ ఆలోచనలను వ్యాపింపజేస్తున్నాడని, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేలా ఇతరులను ప్రేరేపిస్తున్నాడని ఏటీఎస్‌కు సమాచారం అందిందని ఆ ప్రకటన పేర్కొంది. ఈ సమాచారంపై నిందితుడు సబావుద్దీన్‌ను ఎటిఎస్ ప్రధాన కార్యాలయానికి విచారణ కోసం తీసుకువచ్చారు. అక్కడ విచారణలో ఐసిస్‌తో అతని సంబంధాలకు సంబంధించిన ఆధారాలు కనుగొనబడ్డాయి.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications