వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MLAs: విమానంలో వెళ్లిపోతుంటే ఇంటెలిజెన్స్ నిద్రపోయిందా ?, మావాడే మా కొంపముంచాడు, పవార్ ఫైర్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/న్యూఢిల్లీ/ గుహవాటి: మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తున్నా ఆ రాష్ట్ర హోమ్ మంత్రిత్వ శాఖా, ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేకపోయాయని, ఎమ్మెల్యేలు దర్జాగా విమానంలో వెళ్లిపోతుంటే వీళ్లు ఏం చేస్తున్నారు, ఇంట్లో దుప్పటి కప్పుకుని గురకపెట్టి నిద్రపోతున్నారా ? అంటూ ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకి సీఎం పదవి ఇవ్వడానికి అప్పట్లోనే అంగీకరించిన ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆయన పార్టీ నాయకుడిని హోమ్ మంత్రి చేశారు. ఏక్ నాథ్ షిండే మరో ముగ్గురు మంత్రులు, అంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ముంబాయి నుంచి సూరత్ వెళ్లిపోతుంటే వాళ్లకు భద్రత కల్పిస్తున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది హోమ్ శాఖలోని వాళ్ల పైఅధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని శరద్ పవార్ హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులను ప్రశ్నించారని తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మ్యాన్ లు ఉంటారు ?, నాయకుల గన్ మ్యాన్ లు రాష్ట్రం వదిలి వెళ్లే ముందు పై పోలీసు అధికారులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి, అలా ఎందుకు చెయ్యలేదు, అసలు ఏం జరిగింది ? అంటూ శరద్ పవార్ ఆయన పార్టీకి చెందిన హోమ్ మంత్రిని నిలదీశారని వెలుగు చూసింది.

Rebel: సీఎం గ్రూప్ లోని ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్, తగ్గెదేలే అంటున్న ఏక్ నాథ్, మోదీ ఇలాకాలో మకాం, క్యూలో !Rebel: సీఎం గ్రూప్ లోని ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్, తగ్గెదేలే అంటున్న ఏక్ నాథ్, మోదీ ఇలాకాలో మకాం, క్యూలో !

 ఎమ్మెల్సీ ఎన్నికల రోజు చుక్కలు చూపించిన ఏక్ నాథ్ షిండే

ఎమ్మెల్సీ ఎన్నికల రోజు చుక్కలు చూపించిన ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్రలో సోమవారం ఎమ్మెల్యే ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ చేసిన శివసేన ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. క్రాస్ ఓటింగ్ జరిగిందని సీఎం ఉద్దవ్ ఠాక్రే గుర్తించేలోపు మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ముంబాయి నుంచి సూరత్ వెళ్లిపోయారు. తీరా విషయం తెలుసుకున్న సీఎం ఉద్దవ్ ఠాక్రే షాక్ అయ్యారు.

కొంప ముంచిన ఇంటెలిజెన్స్ అధికారులు

కొంప ముంచిన ఇంటెలిజెన్స్ అధికారులు


మంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించలేకపోయింది. ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన రోజు రాత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముంబాయి ఎయిర్ పోర్టు నుంచి సూరత్ వెలుతున్నారని హోమ్ శాఖ గుర్తించలేకపోయింది.

మండిపడుతున్న శరద్ పవార్

మండిపడుతున్న శరద్ పవార్

మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తున్నా ఆ రాష్ట్ర హోమ్ మంత్రిత్వ శాఖా, ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేకపోయాయని, వీళ్లు ఏం చేస్తున్నారు, ఇంట్లో దుప్పటి కప్పుకుని గురకపెట్టి నిద్రపోతున్నారా ? అంటూ ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

హోమ్ శాఖ నిద్రపోయిందా ?

హోమ్ శాఖ నిద్రపోయిందా ?


ఏక్ నాథ్ షిండే మరో ముగ్గురు మంత్రులు, అంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ముంబాయి నుంచి సూరత్ వెళ్లిపోతుంటే వాళ్లకు భద్రత కల్పిస్తున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది హోమ్ శాఖలోని వాళ్ల పైఅధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని శరద్ పవార్ హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులను ప్రశ్నించారని తెలిసింది.

 గన్ మ్యాన్ లు ఏం చేస్తున్నారు ?

గన్ మ్యాన్ లు ఏం చేస్తున్నారు ?

మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మ్యాన్ లు, స్పెషల్ ప్రోటెక్షన్ యూనిట్ పోలీసులు ఉంటారు ?, నాయకుల గన్ మ్యాన్ లు రాష్ట్రం వదిలి వెళ్లే ముందు పై పోలీసు అధికారులకు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి, అలా ఎందుకు చెయ్యలేదు, అసలు ఏం జరిగింది ? అంటూ శరద్ పవార్ ఆయన పార్టీకి చెందిన హోమ్ మంత్రిని నిలదీశారని వెలుగు చూసింది.

 మావాడే మాకొంప ముంచేశాడు

మావాడే మాకొంప ముంచేశాడు

హోమ్ మంత్రిగా ఉన్న దిలీప్ వాస్లే పాటిల్ మా కొంప ముంచేశాడని శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారని, హోమ్ మంత్రి దిలీప్ వాస్లే పాటిల్ కు చివాట్లు పెట్టారని తెలిసింది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకి సీఎం పదవి ఇవ్వడానికి అప్పట్లోనే అంగీకరించిన ఎన్సీపీ నేత శరద్ పవార్ తరువాత ఆయన సొంత పార్టీ నాయకుడు దిలీప్ వాస్లే పాటిల్ ను హోమ్ మంత్రి చేశారు.

English summary
Upset that the state Home ministry and Intelligence department did not alert the MVA leadership about rebel Shiv Sena MLAs leaving Maharashtra. NCP chief Sharad Pawar is said to have conveyed his serious displeasure to state Home Minister Dilip Walse-Patil, who is from the NCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X