VIRAL VIDEO : ఈ ఫైట్ ముందు WWE ఫైట్ కూడా జుజుబీ అనాల్సిందే !!
తమిళనాడులోని నీలగిరి జిల్లా పచ్చని అడవులు, విభిన్న జీవవైవిధ్యానికి ప్రసిద్ధి. సాధారణంగా ఈ ప్రాంతంలో ఏనుగులు, పులులు, బైసన్లు కనిపించడం సాధారణమే. కానీ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన పర్యాటకులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. కోటగిరి - మెట్టుపాలయం కొండ రోడ్డుపై రెండు భారీ ఉడుములు రోడ్డు మధ్యలో నిలబడి ఏకధాటిగా అలుపెరగని పోరాటం చేసుకున్నాయి. ఏఏ ఘటనను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫుల్ వైరల్ గా మారింది.
కాగా ఈ జంతువుల ఫైట్ తో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రోడ్డు మధ్యలో రెండు పెద్ద ఉడుములు ఒకదానిపై ఒకటి దూకుతూ, గట్టిగా పట్టుకుని, నేల మీద రోలింగ్ అవుతూ ఫైట్ చేసుకోవడం మరింత హాట్ టాపిక్ గా మార్చాయి. పోరాటం తీవ్రంగా సాగడంతో కొన్ని నిమిషాల పాటు వాహనాలు కదల్లేకపోయాయి. డ్రైవర్లు, పర్యాటకులు మొదట భయపడి, తర్వాత ఇంత దగ్గరగా ఉడుముల ఫైట్ చూడటం అరుదని ఫోన్ తీసి వీడియోలు తీశారు.

ఇక ఈ మధ్యకాలంలో ఆ మార్గంలో వన్యప్రాణులు తరచుగా కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా వేసవి, మంచుకాలాల్లో జంతువులు వేడి కోసం, ఆహారం కోసం రోడ్డువైపు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. జంతువులు రోడ్డుపై కనిపిస్తే హార్న్ మోగించొద్దని తెలిపారు. వాటిని భయపెట్టేలా వాహనం వేగంగా నడపకండని.. జంతువులకు దూరం పాటించండి, ఫోటోలు/వీడియోలు తీయాలన్నా భద్రత దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
వన్యప్రాణి నిపుణుల ప్రకారం, ఉడుముల మధ్య ఇలా పోరాడటం చాలా సహజం అని చెబుతున్నారు. ఇవి తమ ప్రాంతం పైన ఆధిపత్యం కోసం, ఆహారం కోసం లేదా జంట కోసం ఇలా యుద్ధం చేస్తాయన్నారు. మనుషుల దృష్టిలో ఇది అసాధారణంగా కనిపించినప్పటికీ, ప్రకృతిలో ఇది సహజ జీవ చక్రం అని నిపుణులు వెల్లడించారు.
మరోవైపు ఈ కొండ రోడ్డుల్లో ఎప్పుడూ అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు. కోటగిరి-మెట్టుపాలయం మార్గం తమిళనాడులో అత్యంత అందమైన కానీ వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్న రూట్. అందుకే ఈ మార్గంలో ప్రయాణించే డ్రైవర్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
నీలగిరి జిల్లాలో ఘనమైన అడవులు ఉండటం వల్ల ఏనుగులు, పులులతో పాటు ఉడుములు కూడా తరచుగా కనిపిస్తాయి. ఈ ఉదయం కోటగిరి–మెట్టుపాలయం కొండ రోడ్డుపైన రెండు ఉడుములు రోడ్డుమధ్యలో ఒకదానితో ఒకటి గట్టిగా పోరాడాయి. “నేనే గ్రేట్” అన్నట్టుగా వాటి తగాదా చూసి అక్కడి టూరిస్టులు, డ్రైవర్లు ఆశ్చర్యపోయి… pic.twitter.com/bqXgNkcgYv
— oneindiatelugu (@oneindiatelugu) November 15, 2025
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications