విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..
తమిళ స్టార్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తమిళనాడులో అధికారమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అరవ రాజకీయాల్లోకి తొలిసారి ప్రవేశించిన విజయ్.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోనూ విజయ్ టీవీకే పార్టీ పోటీ చేయనుంది. ఈ మేరకు పుదుచ్చేరిలో టీవీకే పార్టీ తరఫున పోటీ చేయనున్న 30 మంది అభ్యర్థుల జాబితాను విజయ్ తాజాగా ప్రకటించారు.
వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ పోటీకి సిద్ధమైంది. ఈ మేరకు పుదుచ్చేరిలోని 33 స్థానాలకు గాను 30 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విజయ్ ప్రకటించారు. ఈ మేరకు టీవీకే అధికారిక ఎక్స్ ఖాతాలో అభ్యర్థుల పేర్లు, నియోజకవర్గం వివరాలను ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో విజయ్ ఎన్నికల శంఖారావం పూరించినట్లుగా భావించవచ్చు.

ఇక ఇప్పటికే పుదుచ్చేరిలో బీజేపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం 9 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను మాత్రమే బీజేపీ ప్రకటించింది. కానీ విజయ్ టీవీకే పార్టీ మాత్రం పుదుచ్చేరిలోని మొత్తం స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ కోసం విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
— TVK Vijay (@TVKVijayHQ) March 22, 2026
మరోవైపు విజయ్ టీవీకే పార్టీ, బీజేపీ, ఏఐడీఎంకే కూటమిలో భాగస్వామ్యం అవుతుందంటూ వస్తున్న వార్తలపై విజయ్ ఇటీవల మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాము సింగిల్ గానే పోటీ చేస్తామని తమకు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలతో పొత్తు లేదని తేల్చారు. ఇక తమిళనాడులో రాజకీయాలు ఈసారి రసవత్తరంగా మారాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకునేందుకు డీఎంకే- కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు తిరిగి అధికారం పొందేందుకు ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
-
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రెండు చోట్ల విజయ్ పోటీ- టీవీకే జాబితా విడుదల: ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
తెరపై స్టార్ హీరో + దర్శకుడు: విజయ్ వద్దనుకున్న చోట.. -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications