Viral video:ఆవుపై శునకం ప్రతాపం, కర్రతో కొడితేకానీ వదల్లేదు.. వైరల్
గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి. ఎక్కడో ఓ చోట దాడికి దిగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఓ శునకం రెచ్చిపోయింది. ఓ ఆవు నోటి వద్ద గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ ఆవు ఓనర్, స్థానికులు రంగంలోకి దిగితే తప్ప ప్రయోజనం లేకపోయింది. కంటిన్యూగా కర్ర తీసుకొని కొట్టడం వల్ల విడిచి పెట్టింది.
కాన్పూర్‌లో గల సర్సయ్య ఘాట్ వద్ద ఓ ఆవు ఉంది. అక్కడికి ఓ శునకం వచ్చింది. రాగానే ఆవు మూతి పట్టుకొని ఉంది. దీంతో ఆ ఆవు ఆరుపులు మాములుగా లేవు. దీంతో స్థానికులు రంగ ప్రవేశం చేశారు. ఆవును విడిపించేందుకు విఫలయత్నం చేశారు. ఇంకేముంది ఇంతలో ఆ ఆవు యజమాని కూడా వచ్చాడు. ఆ కుక్కను కర్రతో వరసగా కొట్టేశాడు. అప్పుడు కానీ అదీ వదిలిపెట్టలేదు.
कानपुर के सरसैया घाट पर ‘पिटबुल कुत्ते’ ने कर दिया गाय पर हमला।
— Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022
- ग्रामीणों की काफी देर की मशक्कत के बाद गाय को पिटबुल की कैद से छुड़ाया जा सका।
- इस बीच पिटबुल डॉग ने गाय का जबड़ा चबा लिया।
- इस घटना के बाद घाट पर जाने से कतरा रहे हैं सैलानी।
pic.twitter.com/yvbBN5EgSS
ఇలాంటి ఘటన ఇదివరకు జరగలేదని వైద్యుడు ఆర్కే నిరంజన్ తెలిపారు. ఆ శునకానికి వ్యాక్సిన్ వేశామని వివరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ సిబ్బందికి విషయం తెలియజేశామని పేర్కొన్నారు. వారం క్రితం ఆ శునకం మరొకరిని కరిచిందని ట్రిబ్యూన్ రాసింది. దాదాపు ఆరుగురు ఆ శునకం బారిన పడ్డారని వివరించింది.

శునకాలు అంటే గ్రామ సింహాలు అంటారు. దొంగల నుంచి కాపాలాకు చాలా మంది సాదుకుంటారు. అయితే అవీ ఇతర జంతువులు.. మనుషులను కూడా కాటేస్తున్నాయి. ఇదీ కాస్త ఇబ్బందికర పరిస్థితి. కొన్ని చోట్ల విష ప్రయోగం చేసి చంపేస్తున్నారు. కానీ దాని జాతి మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది.












Click it and Unblock the Notifications