వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral News: కోడిపుంజుకు దినాలు చేసి 500 మందికి భోజనం.. ప్రేమమంటే ఇదే..

|
Google Oneindia TeluguNews

ఇటీవల ఓ వీడియో వైరల్ అయింది. అందులో ఓ మేక తన యజమానిని పట్టుకుని ఏడ్చింది. యజమాని మేకను అమ్మడంతో మేక బాధ పడుతూ కన్నీరుకార్చింది. మేకకు ఓనర్ అంటే ప్రేమ మరి.. ఇలానే కుక్కలు, పిల్లులు మనిషులకు దగ్గరగా ఉంటాయి. అవి మనకు దూరమైతే బాధగా ఉంటుంది. ఇలానే తను పెంచుకున్న కోడి పుంజు చనిపోయిందని ఓ యజమాని తీవ్రంగా బాధపడ్డాడు.

500 మందికి భోజనం

500 మందికి భోజనం


వారి కుటుంబం కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత మనషుల్లానే కోడికి అంత్యక్రియలు నిర్వహించాడు. దినం చేశాడు. 500 మందికి భోజనం కూడా పెట్టాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. అయితే కోడి కోసం ఆ కుటుంబం ఇంతలా బాధపడాలా అనుకొవచ్చు.. కానీ దానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే.. ఈ కోడి గొర్రెపిల్ల కోసం పోరాడి ప్రాణాలు పోగోట్టుకుంది.

కుక్కతో పోరాటం..

కుక్కతో పోరాటం..

యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లా బెహదౌల్ కలాన్ గ్రామానికి చెందిన సాలిక్రమ్ సరోజ్ అనే వ్యక్తి ఓ కోడి పుంజును పెంచుకుంటున్నాడు. దానికి లాలీ నామకరణం చేసి మరి పెంచుకుంటున్నాడు. యజమానికి కోడి పుంజుతో పాటు గొర్రె పిల్ల కూడా ఉంది. నెల వయస్సున్న ఆ గొర్రెపిల్లను ఓ వీధి కుక్ కరవబోయింది. ఇది చూసిన కోడిపుంజు.. గొర్రె పిల్లను కాపాడడానికి కుక్కతో పోరాడింది.

శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు..

శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు..

ఆ పోరాటంలో కోడిపుంజు అసువులుబాసింది. గొర్రె పిల్ల కోసం కోడిపుంజు చూసిన త్యాగం, ప్రేమకు సరోజ్ కుటుంబం నివాళి అర్పించి మనిషికి నిర్వహించినట్లుగానే మరణాంతర కార్యక్రమాలు చేసింది. శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు చేశారు. పది రోజుల తర్వాత దినం చేసి.. 500 మందిని పిలిచి భోజనాలు కూడా వడ్డించారు.

కుటుంబ సభ్యుడిలా..

కుటుంబ సభ్యుడిలా..

ఆ భోజనాలు కూడా మాములుగా లేవు. పూరీలు, కచోరీలు, అన్నం, పప్పు, పచ్చళ్లు, బంగాళదుంప, టమోటా కూర, బచ్చలికూర, గుమ్మడికా, బూందీ, స్వీట్లు కూడా వడ్డించారు. సాధారణంగా ఓ కుటుంబ సభ్యుడు చనిపోతే ఏం చేయాలో అన్ని కర్మలను చేశామని సరోజ్ కుమారుడు అభిషేక్ కన్నీరుమున్నీరయ్యాడు.

English summary
When a cock dies, it is given the same funeral as humans. This incident took place in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X