Wife: ఇంట్లో రామాయణం, భార్యకు నిప్పంటించిన సోహెల్, మరదలితో గొడవ జరిగిందని డ్రామా, మ్యాటర్ !
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్న దంపతులు అద్దె ఇల్లు తీసుకుని ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం పనిమీద బయటకు వెళ్లిన భర్త రాత్రి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో చిన్న విషయంలో దంపతుల మద్య గొడవ జరిగింది. చిన్న గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో భార్య ఆమె భర్తకు ఎదురు చెప్పడం మొదలుపెట్టింది. పెళ్లి జరిగి కొన్ని నెలలు కూడా కాకుండానే నా భార్య నాకు ఎదురు చెబుతోందని భర్త ఆవేశంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న కిరోసిన్ భార్య మీద పోసి నిప్పంటించాడు. భార్యకు మంటలు వ్యాపించిన వెంటనే అతను కూడా మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త అతని భార్య చెల్లెలి కారణంగా గొడవ మొదలైయ్యిందని పోలీసులకు చెప్పాడు. పోలీసుల విచాణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

కొత్త కాపురం
దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ పర్బత్ ఏరియాలో సోహెల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది అక్టోబర్ నెలలో కుటుంబ సభ్యులు సెట్ చేసిన హసీనా అనే మహిళను సోహెల్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సోహెల్, హసీనా దంపతులు మూడు నెలలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

ఏకాంతంగా ఉంటున్న దంపతులు
కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్న సోహెల్, హసీనా దంపతులు ఆనంద్ పర్బత్ ఏరియాలో అద్దె ఇల్లు తీసుకుని ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం పనిమీద బయటకు వెళ్లిన సోహెల్ రాత్రి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వంట చేసే విషయంలో హసీనా, సోహెల్ దంపతుల మద్య గొడవ జరిగింది. నేను వంట చెయ్యను అని హసీనా ఆమె భర్త సోహెల్ కు తేల్చి చెప్పింది.

వంట చెయ్యనని ఎదురు తిరిగిన భార్య
వంట చేసే విషయంలో మొదలైన చిన్న గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో నేను చచ్చినా వంట చెయ్యను అని హసీనా ఆమె భర్త సోహెల్ కు ఎదురు చెప్పడం మొదలుపెట్టింది. పెళ్లి జరిగి కొన్ని నెలలు కూడా కాకుండానే నా భార్య హసీనా నాకు ఎదురు చెబుతోందని ఆమె భర్త సోహెల్ ఆవేశంతో ఊగిపోయాడు.

భార్యను సజీవదహనం చెయ్యాలని !
ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకుని భార్య హసీనా మీద పోసిన సోహెల్ ఆమెకు నిప్పంటించాడు. మంటలు తట్టుకోలేక హసీనా కేకలు వేసింది. ఆ సమయంలో భయపడిపోయిన సోహెల్ అతను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు హసీనా, సోహెల్ ను ఆసుపత్రికి తరలించారు.

నా భార్య చెల్లెలు అంతా చేసింది
తీవ్రగాయాలైన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోహెల్ తన భార్య హసీనా చెల్లెలి కారణంగా ఇంట్లో గొడవ మొదలైయ్యిందని పోలీసులకు చెప్పాడు. పోలీసుల విచాణలో వంట విసయంలో గొడవ జరిగింది అనే అసలు విషయం బయటకు వచ్చింది. దంపతులు ఇద్దరూ కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications