వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బీజేపీలో నటి రమ్య చేరిక వెనుక...ఇదీ విషయం'

మాండ్య మాజీ పార్లమెంటు సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్యను బీజేపీలోకి తీసుకోవద్దని మాండ్యకు చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కర్నాటక బీజేపీ అధ్యక్షులు యెడ్యూరప్పకు లేఖ రాశారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాండ్య మాజీ పార్లమెంటు సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్యను బీజేపీలోకి తీసుకోవద్దని మాండ్యకు చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కర్నాటక బీజేపీ అధ్యక్షులు యెడ్యూరప్పకు లేఖ రాశారు.

సర్వే: దక్షిణాదిన బీజేపీ ప్రభుత్వం, కర్నాటకలో 150 సీట్లు సర్వే: దక్షిణాదిన బీజేపీ ప్రభుత్వం, కర్నాటకలో 150 సీట్లు

రమ్యను పార్టీలోకి తీసుకోవద్దని వారు ఆ లేఖలో కోరారు. ఆమె బీజేపీలో చేరడం వెనుక తన రాజకీయ పలుకుబడిని కాపాడుకునేందుకేనని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ విజయవంతంగా ముందుకెళ్తోందని, అందుకే ఆమె మన పార్టీ వైపు చూస్తున్నారని యెడ్డీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఎస్ఎం కృష్ణ దారిలో..

ఎస్ఎం కృష్ణ దారిలో..

కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఎప్పుడో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆలస్యం అవుతోంది. కానీ ఆయన కమలం పార్టీలో చేరడం మాత్రం ఖాయమని తేలింది.

రాజకీయ మెంటర్

రాజకీయ మెంటర్

ఎస్ఎం కృష్ణ.. రమ్యకు రాజకీయ మెంటర్. ఈ నేపథ్యంలో ఆమె కూడా అతని తర్వాత బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరిక తేదీ వచ్చే వారానికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అతని తర్వాత రమ్య కూడా కమలదళం తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. కానీ మాండ్యలో మాత్రం బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆమె చేరికపై అసంతృప్తితో ఉన్నారు.

చేరికపై రమ్య మౌనం

చేరికపై రమ్య మౌనం

ఎస్ఎం కృష్ణ దారిలోనే రమ్య కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కానీ ఆమె మాత్రం దీనిపై మౌనం వహిస్తోంది. ఆమె మౌనమే బీజేపీలో చేరుతానని చెప్పడానికి నిదర్శనం అని అంటున్నారు.

రమ్య చేరికపై వివాదం

రమ్య చేరికపై వివాదం

కొద్ది రోజుల క్రితం మాండ్య నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేత మంజునాథ్.. రమ్య పార్టీలో చేరితో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఆమె గతంలో బీజేపీ, ఆరెస్సెస్‌ల పైన తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేస్తున్నారు.

English summary
Ever since Former Chief Minister S M Krishna quit congress party, there has been an uncertainty over actress-turned-former MP Ramya’s political future, as SMK is considered as her political mentor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X