2023లో వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇప్పటికే డిసైడైన కంపెనీలు; కరోనాతో కొత్త కష్టం!!
చైనాలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. చైనాలో మరణ మృదంగం మారుమోగుతున్న క్రమంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం అవుతున్నాయి. మరోపక్క భారతదేశంలో కూడా కరోనా ఆందోళన కనిపిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బిఎఫ్ 7 ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

మళ్ళీ కరోనా ఆందోళనలో దేశాలు.. వర్క్ ఫ్రమ్ హోం పై ఆలోచన
చైనాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం ఏమాత్రం కట్టడి చేయలేని స్థితికి చేరుకుంది. 20 రోజుల వ్యవధిలో 25 కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పాకిస్తాన్, కజకిస్తాన్, రష్యా , తజకిస్తాన్, వియత్నం తో పాటుగా భారతదేశం, అమెరికాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. మళ్లీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచనలు చేస్తున్నాయి.

వర్క్ ఫ్రమ్ ఆఫీస్ .. అలవాటు చేస్తున్న కంపెనీలకు కరోనా షాక్
అదే విధంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత కరోనా పరిస్థితులు మరోమారు వర్క్ ఫ్రం హోం పై అన్ని కంపెనీలు ఆలోచించేలా చేస్తున్నాయి. ఇక నిన్నటి వరకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అందరూ ఆఫీసులకు రావాలని, ఆఫీసుల నుండే పనులు చేయాలని ఆయా సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న పరిస్థితి ఉంది. గత రెండేళ్ల కాలం గా వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసిన ఉద్యోగులు ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళడానికి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి, మళ్లీ ఆఫీస్ ల నుండి పనిని ట్రాక్ లో పెట్టే పనిలో పడిన సంస్థలకు మరోమారు కల్లోల కరోనా షాక్ ఇచ్చింది.

ఆఫీసులకు వద్దు.. ఇళ్ళ నుండే పని చేసుకోండి
ఊహించని విధంగా మళ్లీ కరోనా ఆందోళన అనేక కంపెనీలపై, వ్యాపార సంస్థలపై బాంబు పేల్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే క్రమంలో హైబ్రిడ్ మోడల్ అమలుచేస్తున్న సంస్థలు, తాజా కరోనా ఆందోళనల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆఫీసుకు వచ్చి పని చేయడంపై ఆలోచనలో పడ్డాయి. మళ్లీ కరోనా కారణంగా పరిస్థితులు తారుమారు అయినట్టు భావిస్తున్న సంస్థలు ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని, వర్క్ ఫ్రం హోం పని చేసుకోమని చెబుతున్నాయి.

భారత్ లోనూ వర్క్ ఫ్రమ్ హోం , హైబ్రిడ్ మోడల్ పని చెయ్యాలని పలు సంస్థల నిర్ణయం
ఇక కరోనా ఆందోళనల నేపథ్యంలో భారతదేశంలో ఉన్న ఫ్లిప్కార్ట్, మారికో, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, టాటా స్టీల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో పాటు పలు దిగ్గజ కంపెనీలన్నీ 2023 లో సైతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా హైబ్రిడ్ మోడల్ ను కొనసాగించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక తాము కల్పించే ఈ సౌకర్యాలతో ఉద్యోగులు ఆఫీస్ వర్క్ తో పాటుగా పర్సనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఏది ఏమైనా మళ్ళీ కరోనా ఆందోళనల నేపధ్యంలో ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోం పని చెయ్యటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మరి 2023 దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications