సైబర్ ఎటాక్‌ను నిలువరించే 'కిల్ స్విచ్': హ్యాకింగ్‌కు చెక్ పెట్టిన హాంకాంగ్ నిపుణుడు..

Subscribe to Oneindia Telugu

హాంకాంగ్: ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా దాదాపు 100దేశాలపై శుక్రవారం నాడు సైబర్ ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే. రాన్సమ్ వేర్ 'వాన్నాక్రై'గా పరిగణిస్తున్న ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంస్థలను ముప్పు తిప్పలు పెట్టింది. ఏపీలో అయితే ఏకంగా పోలీస్ నెట్ వర్క్ సైతం హ్యాకింగ్ కు గురైన పరిస్థితికి నెలకొంది.

తాజాగా హాంకాంగ్ లోని ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఈ వైరస్ కు కిల్లర్ స్విచ్ ను కనుగొన్నారు. ప్రస్తుతం వాన్నక్రైని నిలువరించేది ఇదొక్కటేనని తెలుస్తోంది. @MalwareTechBlog అనే హ్యాండిల్ ద్వారా ఈ నిపుణుడు ట్వీట్ చేస్తున్నాడు. అనుకోకుండా దీనిని కనుగొన్నానని చెప్పిన ఆ నిపుణుడు.. మాల్ వేర్ ఉపయోగించే ఒక డొమైన్ పేరును రిజిస్టర్ చేయడం ద్వారా ఇది మరింత విస్తరించకుండా ఆపవచ్చునని అన్నారు.

'Accidental hero' finds kill switch to stop spread of ransomware cyber-attack

ఇదే తరహాలో తాము మాల్ వేర్ స్ప్రెడ్ కాకుండా అడ్డుకున్నామని ఆయన తెలిపారు. సైబర్ ఎటాక్ ను నిలువరించాలంటే.. యూజర్స్ అంతా తమ సిస్టమ్స్ ను అప్ డేట్ చేయాలని సూచించారు. సంక్షోభం ఇప్పుడే ముగిసిపోలేదని, సైబర్ దాడికి దిగుతున్నవారు.. కోడ్ మార్చడం ద్వారా మరోసారి హ్యాకింగ్ కు పాల్పడవచ్చునని చెప్పుకొచ్చారు.

కాగా, శుక్రవారం నాడు తొలుత లండన్ లోని ఆసుపత్రులకు సంబంధించిన నెట్ వర్క్ ను హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఆ తర్వా తక్రమంగా ప్రపంచంలోని చాలా దేశాల మీద దాడులు చేస్తూ వస్తున్నారు. హ్యాకర్లు రాన్సమ్ వేర్ అనే టెక్నిక్ ఉపయోగించడం ద్వారా ఫైల్స్ అన్ని లాక్ అయిపోతున్నాయన్నారు. ఆ ఫైల్స్ మళ్లీ ఓపెన్ కావాలంటే.. బిట్ కాయిన్ల రూపంలో హ్యాకర్లకు అడిగినంత మేర చెల్లించుకోవాలని అన్నారు.

శనివారం ఉదయానికల్లా దాదాపు 74దేశాల్లో 45వేల సైబర్ దాడులు జరిగినట్లు యాంటీ వైరస్ సంస్థ కాస్పర్ స్పీకి చెందిన పరిశోధకుడు కాస్టిన్ రెయు తెలిపారు. ఇదిలా ఉంటే, హాంకాంగ్ నిపుణుడు కనుగొన్న కిల్లర్ స్విచ్.. ఇప్పటికే రాన్సమ్ వేర్ ఇన్ఫెక్ట్ అయిన సిస్టమ్స్ కు ఇది పనిచేయదని చెబుతున్నారు. హ్యాకింగ్ జరగకముందు మాత్రమే ఇది సిస్టమ్ ను ప్రొటెక్ట్ చేయగలదని, ఒకసారి మాల్ వేర్ ఎంటర్ అయ్యాక ఏం చేయలేమని చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An “accidental hero” has halted the global spread of the WannaCry ransomware, reportedly by spending a few dollars on registering a domain name hidden in the malware.
Please Wait while comments are loading...