వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఏషియా: తోక భాగం దొరికింది, బ్లాక్ బాక్స్‌పై ఆశలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

జకర్తా: ఎయిర్ ఏషియా విమానానికి సంబంధించిన మరో శకలం బుధవారం ఉదయం కనిపించింది. ఆ శకలం విమానం వెనుక భాగంగా (టెయిల్) అధికారులు భావిస్తున్నారు. విమానం టెయిల్ లభించడంతో బ్లాక్ బాక్స్ కూడా లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దాని కోసం గాలిస్తున్నారు. విమానం వెనుక భాగం జావా సముద్రంలో గుర్తించామని ఇండోనేషియా రక్షక, దర్యాఫ్తు బృందాల అధికారి తెలిపారు. బ్లాక్ బాక్స్ కూడా త్వరలో కనుగొంటామన్నారు. ప్రమాదానికి గల కారణాలు వివరించే బ్లాక్ బాక్స్ సాధారణంగా విమానం వెనుక భాగంలో అమర్చుతారు.

AirAsia: Tail of crashed plane found

కాగా, ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలి 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజిలా యాంగీ రణస్టియానీస్ టీవీ చానల్స్ ముందుకు వచ్చి స్పందించారు. విమానం కూలిన విషయంలో తన తండ్రిని తప్పుపట్టవద్దని ఆమె కోరారు.

చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులోని ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నించారని చెప్పారు. అసలు ఏ పైలట్ కూడా ప్రయాణీకులకు హానీ కలిగించాలని అనుకోరని చెప్పారు. అలా ఓ పైలట్ వ్యవహరిస్తారంటే తాను అంగీకరించలేనని చెప్పారు. తన తండ్రి కూడా ఈ ప్రమాదంలో మరణించారని, ఆయన మృతదేహం కూడా ఇప్పటి వరకు లభించలేదన్నారు. ఇప్పటికే తమ కుటుంబం ఆవేదనలో ఉందన్నారు.

English summary
Recovery teams have found the tail of the crashed AirAsia Flight 8501 in the Java Sea, the Indonesian search chief said Wednesday, the eleventh day of relief operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X