వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ ఆస్తులు వందల కోట్లు, జిహాద్‌కు వీలునామా!

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సూడాన్ బ్యాంకుల్లో తన పేరిట ఉన్న 197 కోట్లకు పైగా రూపాయలను, తన ఇంజినీర్ సోదరుడు ఇంజినీరింగ్ కంపెనీ నుంచి తన వాటా కింద అందిన దాదాపు రూ.82 కోట్ల రూపాయలను.. మొత్తం రూ.279 కోట్ల రూపాయల్లో సగ భాగాన్ని ప్రపంచ జీహాది కోసం ఖర్చు పెట్టాలని ఒసామా బిన్ లాడెన్ వీలునామా రాశాడు.

లాడెన్‌కు చెందిన పత్రాలను తాజాగా విడుదల చేశారు. అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. సూడాన్ బ్యాంకుల్లో మొత్తంలో సగ భాగాన్ని తన తల్లి ఖదీజా ఉమ్‌కు, తన కుమారుడు సాద్ బిన్ ఉసామాకు చెరి సమానం పంచాలని అందులో సూచించాడు.

 Bin Laden left $29m inheritance for jihad

అలాగే తన కూతురుతో పాటు తన ముగ్గురు చెల్లెళ్లు, తన పినతల్లులు, వారి పిల్లలకు, తన మామ, వారి పిల్లలకు ఎవరికెంత వాటా ఇవ్వాలో కూడా ఆ వీలునామాలో పేర్కొన్నాడు. సూడాన్ బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేయడంలో సహకరించిన అల్ ఖైదా మిలిటెంట్ మెహ్ ఫౌజ్ ఆల్ వాలిద్‌కు ఒక శాతం ఇవ్వాలన్నాడు.

కోట్లాది రూపాయల బంగారాన్ని కూడా భార్య, పిల్లలు, చెల్లెలు, చిన్నమ్మలు, మామ, వారి పిల్లలకు వాటాలు వేశాడు. ఈ వీలునామాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు తండ్రి, కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

తాను సూచించినట్లు వాటాల పంపకం జరగకుంటే తన ఆత్మ సమాధిలోనే బందీ అవుతుందని పేర్కొన్నాడు. లాడెన్ 1966కు ముందు ఐదేళ్ల పాటు సూడాన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆప్ఘనిస్తాన్ వెళ్లిపోయాడు. 2011లో పాక్‌లోని అబొట్టాబాదులో అమెరికా సైనిక దళం చేతిలో హతమయ్యాడు.

English summary
Osama Bin Laden left $29m inheritance for jihad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X