షాక్: పహల్గామ్ మారణహోమం రిపీట్: బుల్లెట్ల వర్షం: అమాయకులు బలి
ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చిచంపారు. ఘటనతో ఒక్కసారిగా సిడ్నీ ఉలిక్కిపడింది. ఈ ఘటన బీచ్‌లో ఉన్న వారిలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే స్పందించారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఈ సమాచారం అందగానే ఆస్ట్రేలియన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల తదుపరి ఆదేశాల మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలంలో ఉన్న వారందరూ వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని, అందుబాటులో ఉన్న ప్రదేశంలో ఆశ్రయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6:30 గంటల సమయంలో వెంటవెంటనే పలు కాల్పుల శబ్దాలు వినిపించాయని, ఇది మాస్ షూటింగ్ కు దారితీసిందని 'ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' తెలిపింది. కాల్పులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నల్లటి వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు బీచ్‌లోని ఓ వంతెన సమీపంలో కాల్పులు జరుపుతున్నట్లు ఈ వీడియోలో రికార్డయింది. అరడజనుకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ వెంటనే ప్రజల అరుపులు వినిపించాయి. భయంతో పరుగులు తీశారు.
this is fucking appalling. this is bondi beach. this is modern australia. pic.twitter.com/nfD7Z2Xz34
— vrsaljak (@vrsaljak) December 14, 2025
ఈ పరిస్థితులపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కార్యాలయ అధికార ప్రతినిధి మాట్లాడారు. బాండీ బీచ్ లో కాల్పులు జరిగిన విషయాన్ని నిర్ధారించారు. ప్రస్తుత భద్రతా పరిస్థితి గురించి ఆరా తీస్తోన్నామని, సమీపంలో ఉన్న ప్రజలు న్యూ సౌత్ వేల్స్ పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.
BREAKING: Watch as bystander disarms active shooter at Bondi Beach in Sydney, Australia.pic.twitter.com/ko1DIo7tMY
— AZ Intel (@AZ_Intel_) December 14, 2025
ఈ ఘటనపై అన్ని వివరాలను సేకరిస్తోన్నామని తెలిపారు. ప్రస్తుతం బీచ్ ను నూ సౌత్ వేల్స్ పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాండీ బీచ్‌లో జనం భయంతో పారిపోవడం, కాల్పుల శబ్దాలు, పోలీసు సైరన్లు వినిపించాయి. 50కి పైగా బుల్లెట్లు పేల్చారని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది.
you can hear the many gunshots - people fleeing bondi beach https://t.co/BuACnE89aN pic.twitter.com/VXe0fyYey5
— Sina (@SinaHartung) December 14, 2025
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications