భారత్‌కు నంబర్ 1 శత్రువు చైనాయే!: పెంటగాన్ నివేదికలో షాకింగ్ నిజాలు
ఇండియాను చుట్టుముట్టేందుకు చైనా తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఓవైపు అరుణాచల్ ప్రదేశ్‌ను తన ప్రధాన ప్రయోజన జాబితాలోకి చేర్చుతూ.. మరోవైపు పాకిస్థాన్‌ను భారత్ పైకి ఉసిగొల్పుతూ చైనా ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అమెరికా రక్షణ శాఖ(పెంటగాన్) తాజాగా విడుదల చేసిన 'మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్స్ 2025' నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అరుణాచల్ ప్రదేశ్‌పై 'టెన్షన్'
పెంటగాన్ నివేదిక ప్రకారం.. చైనా తన ప్రాదేశిక వాదనలను విస్తరించింది. ఇప్పటివరకు తైవాన్, దక్షిణ చైనా సముద్రంపై మాత్రమే చూపిస్తున్న 'కోర్ ఇంట్రెస్ట్'ను ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌కు కూడా వర్తింపజేస్తోంది. అరుణాచల్‌ను 'దక్షిణ టిబెట్'గా పిలుస్తున్న చైనా.. అక్కడ వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి సైనిక మోహరింపును భారీగా పెంచింది. తవాంగ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు భారత సైన్యం కూడా రికార్డు స్థాయిలో ఆయుధాలను, బలగాలను మోహరించింది.

పాకిస్థాన్‌తో కలిసి భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్
దక్షిణాసియాలో భారత్ ఎదుగుదలను అడ్డుకోవడానికి చైనా తన 'మిత్రదేశం' పాకిస్థాన్‌ను ఆయుధశాలగా మారుస్తోంది. చైనా ఇప్పటికే పాకిస్థాన్‌కు 36 J-10C ఫైటర్ జెట్లను సరఫరా చేసింది. వీటిని పాక్ ఇటీవల భారత సరిహద్దుల్లో మోహరించింది. పాకిస్థాన్ గడ్డపై సొంతంగా ఒక సైనిక స్థావరాన్ని నిర్మించేందుకు చైనా చురుగ్గా ప్రయత్నిస్తోందని పెంటగాన్ నివేదిక వెల్లడించింది. దీని ద్వారా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంపై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది.
అణ్వాయుధాల విధ్వంసం
చైనా తన అణు సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం చైనా వద్ద దాదాపు 600 అణు బాంబులు ఉండగా.. 2030 నాటికి వీటి సంఖ్యను 1000 దాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా సముద్ర గర్భంలో తన శక్తిని చాటేందుకు 2035 నాటికి 6 విమానవాహక నౌకలను (Aircraft Carriers) నిర్మించాలని యోచిస్తోంది.
చైనా చాపకింద నీరు వ్యూహం
గత ఏడాది లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి సైనిక ఉపసంహరణ జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమీ మారలేదు."భారత్-అమెరికా స్నేహాన్ని దెబ్బతీయడానికి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గినట్లు చైనా నటిస్తోంది. కానీ భారత్ దాని ఉద్దేశాలను ఎంతమాత్రం నమ్మడం లేదు" అని నివేదిక స్పష్టం చేసింది.
గ్లోబల్ నెట్వర్క్: చైనా స్థావరాలు ఎక్కడెక్కడ?
పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి మరో 20 దేశాల్లో తన సైనిక ఉనికిని చాటడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికా, భారత్ ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. చైనా చేస్తున్న ఈ పన్నాగాలను ఎదుర్కోవడానికి భారత్ తన రక్షణ బడ్జెట్‌ను పెంచడమే కాకుండా, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. చైనా ఎంతటి కుతంత్రాలకు పాల్పడినా, దీటుగా సమాధానం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications