వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు: బహ్రెయిన్ దౌత్యాధికారిపై కేసు

|
Google Oneindia TeluguNews

bahrain
ముంబై: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భారత్‌లోని బహ్రెయిన్ దౌత్యాధికారిపై ముంబైలోని మాలబార్ హిల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు దౌత్యాధికారి కావడంతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేయలేదు. బహ్రెయిన్ కాన్సుల్ జనరల్ అబ్దుల్లాజిజ్ అల్ ఖాజా అసభ్యంగా ప్రవర్తించారని, తనను దూషించారని దక్షిణ ముంబైలోని హౌజింగ్ సొసైటీ మేనేజర్(49) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిసెంబర్ 9న లిఫ్ట్ పనిచేయని కారణంగా ఖాజా తనతో వాగ్వాదానికి దిగి, దూషించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది పాత భవనం అని, ఇటీవల ఎలివేటర్‌ను మార్చినట్లు బాధితురాలు తెలిపారు. అయితే లిఫ్ట్ పని చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని ధ్వంసం చేసేందుకు ఖాజా ప్రయత్నించాడని ఆమె చెప్పారు. ఎంత సర్ది చెప్పినా వినకుండా తనతో వాగ్వాదానికి దిగి, దూషించారని బాధితురాలు తెలిపారు.

తనను దూషించడమే కాక, తనపై వేధింపులకు పాల్పడ్డారని, అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడికి చేరుకున్న ఇతర సొసైటీ సభ్యులు అతన్ని వారించి అక్కడి నుంచి పంపించారని ఆమె తెలిపారు. కాగా ఖాజా ప్రవర్తను తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు తన న్యాయవాది సహాయంతో నిందితుడు ఖాజాపై ఫిర్యాదు చేశారు. మంత్రాలయలోని సాధారణ పరిపాలన విభాగం ముఖ్య ప్రొటోకాల్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆమె ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీలోని బహ్రెయిన్‌ దౌత్య కార్యాలయానికి ఫిర్యాదు పంపినట్లు ఆమె తెలిపారు. అయితే ఎలాంటి సమాచారం తిరిగి రాలేదని చెప్పారు. దీంతో పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డిసెంబర్ 13న ఖాజాపై ఐపిసి 354, 509, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా అమెరికాలో మాత్రం భారత దౌత్య అధికారిణిగా వ్యవహరిస్తున్న దేవయాని కోబ్రాగాడెపై ఆరోపణలు వచ్చిన వెంటనే అక్కడి పోలీసులు బేడీలు వేసి మరీ అరెస్ట్ చేయడం గమనార్హం.

English summary
The Malabar Hill police has booked Consul General of the Kingdom of Bahrain in Mumbai under charges of molesting and hurling abuses at a woman. The police is still in a tizzy as the accused enjoys diplomatic immunity that protects him from being arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X