Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూఎస్ లో కరోనా కల్లోలం: ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత; డెల్టా వేరియంట్ దెబ్బకు ప్రజలు విలవిల

యూఎస్ మళ్లీ కరోనా బాధితుల దేశంగా మారింది. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మళ్లీ జోరుగా కరోనా కేసులు నమోదవుతున్న తీరు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. నిత్యం పెరుగుతున్న కరోనా కేసులతో హాస్పిటల్స్ లో రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా కరోనా కేసులు ఆసుపత్రులలో చేరిక పెరగడంతో యూఎస్ దక్షిణ ప్రాంతాలలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా సమస్య తలెత్తుతోంది. యూఎస్ దక్షిణ ప్రాంతాలలో చాలామందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు .ఈ సమయంలో లక్షలాది అమెరికన్లకు అత్యంత ప్రమాదకరమైన కరోన వేరియంట్ సోకడంతో వారంతా ఆసుపత్రుల పాలవుతున్నారు.

యూఎస్ దక్షిణ ప్రాంతాలలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత

యూఎస్ దక్షిణ ప్రాంతాలలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత

తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారికి ఆక్సిజన్ ను అందించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో యూఎస్ దక్షిణ ప్రాంతాలలో ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నాయి. ఫ్లోరిడా, దక్షిణ కరోలినా, టెక్సాస్ మరియు లూసియానాలోని అనేక ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య అధికారులు మరియు హాస్పిటల్ కన్సల్టెంట్ల ప్రకారం, కొందరు తమ రిజర్వ్ సప్లైని ఉపయోగించాల్సిన ప్రమాదం, ఆక్సిజన్ అయిపోయే ప్రమాదం ఉంది.

 టీకాలు తీసుకోని వారిపై కరోనా పంజా .. ఆస్పత్రుల్లో బెడ్లు, సిబ్బంది కొరత

టీకాలు తీసుకోని వారిపై కరోనా పంజా .. ఆస్పత్రుల్లో బెడ్లు, సిబ్బంది కొరత

కోవిడ్ -19 కేసుల్లో నిరంతర పెరుగుదల కారణంగా, యూఎస్ లో ఆక్సిజన్ సరఫరాపై మరింత డిమాండ్ ఏర్పడింది. ఆ అవసరాలను తీర్చడానికి ఆసుపత్రులు వేగవంతం కాని పరిస్థితి నెలకొంది. దక్షిణాదిలోని హాస్పిటల్స్ లో చాలా భాగాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న హాస్పిటల్స్ లో కరోనా రోగుల హాస్పిటలైజేషన్లు మరింత పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి మహమ్మారి టీకాలు వేయని సామాన్యులైన మిలియన్ల మంది అమెరికన్లకు సోకిన డేంజరస్ కరోనావైరస్ వేరియంట్. పెరుగుతున్న కరోనా పేషెంట్ల కారణంగా ఆస్పత్రుల్లో బెడ్ ల కొరత నెలకొంది. సిబ్బంది కూడా సమస్యగా మారింది. ఇప్పుడు ఆక్సిజన్ కోసం తిప్పలు మొదలయ్యాయి.

ఆక్సిజన్ ట్యాంకుల్లో 10 శాతానికి ఆక్సిజన్ చేరుకున్నా రీఫిల్ చెయ్యని పరిస్థితి

ఆక్సిజన్ ట్యాంకుల్లో 10 శాతానికి ఆక్సిజన్ చేరుకున్నా రీఫిల్ చెయ్యని పరిస్థితి

సాధారణంగా ఆక్సిజన్ ట్యాంకులు 90% సప్లయర్స్ ద్వారా నింపబడతాయి. తిరిగి ఆక్సిజన్ ట్యాంకులను 30 నుండి 40 శాతం మేరకు ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నప్పుడే అలెర్ట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ రీఫిల్ చేస్తారు. కానీ ట్యాంకులలో నిండుకున్న తర్వాత కూడా తిరిగి రీఫిల్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుతం పరిస్థితులు 10 నుండి 20 శాతం ఆక్సిజన్ లెవెల్స్ చేరుకున్నా రీఫిల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ రీఫిల్ చేసినప్పటికీ కేవలం 50 శాతం మాత్రమే ఆక్సిజన్ ను రీఫిల్ చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఆసుపత్రుల వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

 డెల్టా వేరియంట్ వల్లే ఆక్సిజన్ తిప్పలు .. ఈసారి మరణాల లెక్క చెప్పిన వైద్య నిపుణుడు

డెల్టా వేరియంట్ వల్లే ఆక్సిజన్ తిప్పలు .. ఈసారి మరణాల లెక్క చెప్పిన వైద్య నిపుణుడు

డెల్టా వేరియంట్ కారణంగా ఆక్సిజన్ అవసరం అవుతున్న పరిస్థితి తలెత్తుతుందని, శ్వాసకోస సమస్యలు తీవ్రంగా బాధితులను వేధిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం యుఎస్ లో 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారు కోవిడ్ బారిన పడుతున్నారని, వారు ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నారు అని సమాచారం అంతేకాదు మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టు, కరోనా సోకిన కొద్దిరోజుల్లోనే వారంతా మృతి చెందుతున్నట్లు చెప్తున్నారు. యూఎస్ ప్రభుత్వ వైరల్ జబ్బుల నిపుణుడు డాక్టర్ ఆంధోని ఫౌసి ఈసారి యూఎస్ డిసెంబరు నాటికి లక్ష అదనపు మరణాలను చూస్తుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ మోడల్ వెల్లడించిందని పేర్కొన్నారు.

వ్యాక్సిన్లు తీసుకోని వారే ఎక్కువగా మృతులు .. వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాలన్న నిపుణులు

వ్యాక్సిన్లు తీసుకోని వారే ఎక్కువగా మృతులు .. వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాలన్న నిపుణులు

యూఎస్లో ప్రస్తుతం 52.1 శాతం ప్రజలకు వాక్సినేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వ్యాక్సిన్స్ తీసుకోని వారు ప్రస్తుతం కరోనా బాధితులుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్లు తీసుకోని వారిలోనే మరణాల రేటు ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా మహమ్మారి సోకినప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మహమ్మారి నుండి యూఎస్ ప్రజలను కాపాడడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని పదేపదే హెచ్చరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+