షాక్: టెర్రరిస్టును పట్టుకొనే పనిని అప్పగిస్తే అతడినే పెళ్ళాడింది, చివరికిలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: టెర్రరిస్టులను పట్టుకొనేందుకు నియమించిన ఓ మహిళా అధికారిణి, ఏకంగా టెర్రరిస్టుతో ప్రేమలో పడింది. అంతేకాదు తల్లిదండ్రులను కలుసుకొనేందుకు వెళ్ళిన ఎఫ్ బి ఐ అధికారిణి టెర్రరిస్టును పెళ్ళాడింది.ఎట్టకేలకు అమెరికాకు చేరుకొన్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాలో ఎఫ్ బి ఐ లో డానియెలా గ్రీన్ అనే ఎఫ్ బి ఐ అధికారి పనిచేస్తోంది.అయితే ఆమె టెర్రరిస్టులను పట్టుకొనేందుక నిఘా అధికారిగా నియమించారు. అయితే ఆమె టెర్రరిస్టులను పట్టుకొనే పనిని వదిలేసింది. టెర్రరిస్టుతోనే ఏకంగా ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకొంది.

FBI Translator Daniela Greene Married ISIS Fighter She Spied On

ఈమెకు అత్యంత రహాస్య భద్రత కూడ ఉంది. ఈ పత్రాల ప్రకారంగా 2014 జూన్ జర్మనీలో తన తల్లిదండ్రులను చూసేందుకు బయలుదేరిని ఆమె అక్కడికి వెళ్ళలేదు. టర్కీకి వెళ్ళింది. టర్కీ సరిహద్దు గుంగా వెళ్ళి ఐసిస్ ఉగ్రవాదిని కలిసింది.

ఆ ఉగ్రవాదిని వివాహం చేసుకొంది. అయితే అతడు ఎవరనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. డెనిస్ కస్పెర్ట్ అనే ఉగ్రవాదిని ఆమె వివాహం చేసుకొన్నట్టుగా స్థానిక మీడియా ప్రసారం చేసింది. 2015 లో డెనిస్ ను ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది.

జర్మనీకి చెందిన ఐసిస్ ఉగ్రవాద గ్రూపుపై నిఘా నిర్వహించేందుకుగాను ఎప్ బి ఐ లో అనువాద విభాగంలో డానియెలాను నియమించారు. 2011 లో అమెరికన్ ను వివాహం చేసుకొన్న ఆమె అనుహా్యంగా 2014 లో మాయమైంది.

జూన్ నెలలో కన్పించకుండా పోయిన ఆమె అదే నెలలో ఉగ్రవాది డెనిస్ ను వివాహం చేసుకొంది. అయితే అది విషాదం అని తెలుసుకొనేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు.తాను ఎంత తప్పు చేశానో ఆమె తనకు తెలిసిన వ్యక్తికి మెయిల్ పంపింది. తన జీవితం ఎన్నిరోజులు ఇక్కడ మగ్గిపోతోందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.ఈ మేరకు మరో మెయిల్ ను కూడ పంపింది.

అయితే యూఎస్ వస్తే తనను జీవితాంతం జైల్లోనే ఉంచుతారని అయినా ఫర్వాలేదని ఆమె పేర్కొంది. ఆ తర్వాత అక్కడి నుండి తప్పించుకొని ఆగష్టు మాసంలో ఆమె అమెరికాకు వచ్చింది.దీంతో ఆమెను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.

తన నేరాన్ని ఆమె ఒప్పుకొంది. జరిగిన విషయాలన్నీ పోలీసులకు చెప్పింది. పోలీసులకు పూర్తిగా సహకారాన్ని అందించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు చేరాయి. అవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. స్కైప్ ద్వారా ఉగ్రవాదితో ఆమెకు సంబంధాలు ఏర్పడ్డాయి.వాస్తవాలు చెప్పడంతో ఆమెకు కోర్టు రెండేళ్ళపాటు జైలు శిక్ష విధించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An FBI translator who was hired to spy on a German member of the ISIS group instead apparently grew attracted to him and snuck off to Syria to get married.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి