విమానం బాత్రూంలను గబ్బులేపాడు: ఫ్లైట్ మళ్లింపు, దించేశారు

చికాగో: విమానంలోని బాత్రూంలను ఓ ప్రయాణికుడు పాడుచేయడంతో ఆ విమానాన్ని మధ్యలోనే వేరోచోటుకి మళ్లించి దింపేశారు. చికాగో నుంచి హాంగ్‌కాంగ్‌ వెళ్తున్న యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానంలో ఓ ప్రయాణికుడు బాత్రూంలను పాడు చేశాడు. రెండు బాత్రూంల నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. దీంతో విమానాన్ని అలస్కాకు మళ్లించారు. విమానాన్ని శుభ్రం చేయడానికి రాత్రంతా అక్కడే ఉంచాల్సి రావడం గమనార్హం.

 Flight diverted after man defecates, makes mess of 2 bathrooms

ప్రయాణికులకు హోటళ్లలో బస ఏర్పాటు చేసి తర్వాత వారి గమ్యస్థానాలకు పంపించేశారు. కాగా, బాత్రూంలు చాలా దారుణంగా పాడుచేశాడని, అంతేకాకుండా అతడి చొక్కా టాయ్‌లెట్‌లో కుక్కేందుకు ప్రయత్నించాడని, అతడి ప్రవర్తన కారణంగా విమానం దించేయాల్సి వచ్చిందని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది.

అయితే, ఆ ప్రయాణికుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతడి మానసిక స్థితి గురించి తెలుసుకోవడానికి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, విమానంలోని 245మంది ప్రయాణికులను శుక్రవారం ఉదయం గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+