ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్: నేడు వైట్ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ!
సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 1946లో సిరియా స్వాతంత్య్రం పొందిన తర్వాత అమెరికాను సందర్శించిన మొట్టమొదటి సిరియా దేశాధినేత అల్-షారా కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య పర్యటన సందర్భంగా మే నెలలో సౌదీ అరేబియాలో సిరియా అధ్యక్షుడు అల్-షారాతో మొదటిసారి సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ట్రంప్ సిరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నేడు (సోమవారం, నవంబర్ 10న) వైట్ హౌస్‌లో వీరిద్దరి మధ్య సమావేశం జరగనుంది.
ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్
ఒకప్పుడు అహ్మద్ అల్-షారా ఒక భయంకరమైన ఉగ్రవాది. అప్పుడు అతడిని అబు మొహమ్మద్ అల్-గోలాని అనే పేరుతో పిలిచేవారు. 2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేయడానికి కొద్దికాలం ముందు అతడు అల్-ఖైదా ఉగ్రవాద సంస్థలో చేరాడు. 2006 నుంచి 2011 వరకు అల్-షారా అమెరికా జైలులో బందీగా ఉన్నాడు. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగినందుకు అమెరికా అతడిపై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.జైలు నుంచి విడుదలైన తర్వాత అల్-షారా సిరియా అంతర్యుద్ధంలో అస్సాద్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి అల్-ఖైదా మద్దతుతో 2012లో అల్-నుస్రా ఫ్రంట్‌ను స్థాపించాడు.

ఉగ్రవాదం నుంచి అధ్యక్ష పదవి వరకు
2016లో అల్-షారా అల్-ఖైదాతో ఉన్న సంబంధాలను తెంచుకున్నాడు. అంతర్జాతీయ జిహాద్‌ను విడిచిపెట్టి సిరియాలోని మైనారిటీలను రక్షించే ఉద్దేశంతో దేశ పాలనపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో 2017లో అల్-నుస్రాను ఇతర సంస్థలతో విలీనం చేసి హయత్ తహ్రీర్ అల్-షాం (HTS) ను స్థాపించాడు. 8 డిసెంబర్ 2024న, సిరియాలో జరిగిన అధికార మార్పిడిలో HTS కీలక పాత్ర పోషించింది. ఈ మార్పిడిలో అల్-షారా ముఖ్య భూమిక వహించాడు. 29 జనవరి 2025న అల్-షారా సిరియా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
అకస్మాత్తుగా మారిన అమెరికా వైఖరి
అల్-షారా అమెరికా పర్యటన, ట్రంప్‌తో సమావేశం అమెరికా వైఖరిలో ఆకస్మిక మార్పును సూచిస్తుంది. ఒకప్పుడు అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ల జాబితాలో ఉన్న వ్యక్తిని ఆ జాబితా నుంచి తొలగించి ఇప్పుడు వైట్ హౌస్‌లో సగౌరవంగా ఆహ్వానించడం ఆశ్చర్యం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
-
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
ఇరాన్ తో డీల్ లేనట్లేనా ? సర్వనాశనమే- ట్రంప్ ఫైనల్ వార్నింగ్..! -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications