• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం వేళ..పుతిన్ ఎంజాయ్: హార్స్‌రైడింగ్..షర్ట్ లేకుండా: జీ7 దేశాధినేతల సెటైర్లు

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. జర్మనీ దక్షిణ ప్రాంతంలోని బవారియన్ ఆల్ప్స్ రీజియన్‌లో గల ఎల్మావ్ క్యాజిల్ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ సమ్మిట్ మొదలైంది. రెండు రోజుల కొనసాగుతుంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉగ్రవాదం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు, పర్యావరణం.. వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. అనంతరం జీ7 దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదిస్తాయి.

భారత్‌తో పాటు అర్జెంటీనా, ఇండొనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికాలను కూడా జర్మనీ ఆహ్వానించింది. ఇందులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదివరకే జర్మనీ చేరుకున్నారు. మ్యూనిచ్‌లో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు సాదర స్వాగతం లభించింది. బవారియన్ బ్యాండ్ ఆయనకు ఘన స్వాగతం పలికింది. జర్మనీలోని భారతీయులను మోడీ కలుసుకున్నారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

G7 leaders mocked Russian President Vladimir Putin over his shirtless horse-riding Photo

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఫొటో ఒకటి జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రస్తావనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్.. ఇలా హార్స్ రైడింగ్‌తో ఎంజాయ్ చేస్తోండటాన్ని జీ7 దేశాధినేతలు, ప్రధానమంత్రులు తప్పు పట్టారు. నిజానికి- ఇది 2009 నాటి ఫొటో. అయినప్పటికీ- ఇప్పుడు ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. జీ7 సదస్సులో ఇది ప్రస్తావనకు వచ్చింది.

యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని ఏ మాత్రం అంచనా వేయడంలో పుతిన్ విఫలం అయ్యాడని, ఇలా తన ఇష్టాన తాను ప్రవర్తిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఎప్పట్లాగే- యుద్ధ సమయాన్ని కూడా పుతిన్ ఆస్వాదిస్తోన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఈ ఫొటోపై ఓ మినీ డిబేట్ సాగించారు. ఈ ఫొటోపై బోరిస్ జాన్సన్ సెటైర్లు సంధించారు. జాకెట్స్ ఆన్?.. జాకెట్స్ ఆఫ్? అంటూ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చురకలు అంటించారు. తాము కూడా త్వరలోనే ఇలా ఎలాంటి అచ్ఛాదన లేకుండా హార్స్ రైడింగ్ చేద్దామంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కామెంట్స్ చేశారు.

English summary
G7 leaders mocked Russian President Vladimir Putin over his shirtless, bare-chested horse-riding picture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X