India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ భుజం మీద చెయ్యేసి ఆహ్వానం: ఉక్రెయిన్‌పై జీ7 దేశాల వరాల సునామీ: భారత్ కూడా

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. జర్మనీ దక్షిణ ప్రాంతంలోని బవారియన్ ఆల్ప్స్ రీజియన్‌లో గల ష్లాస్ ఎల్మావ్‌లో ఈ సమ్మిట్ మొదలైంది. రెండు రోజుల కొనసాగుతుంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉగ్రవాదం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులు, పర్యావరణం.. వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. అనంతరం జీ7 దేశాలు పలు తీర్మానాలను ఆమోదిస్తాయి.

అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌తో పాటు భారత్‌, అర్జెంటీనా, ఇండొనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఇందులో పాల్గొన్నారు. కొద్దిసేపటి కిందటే ఈ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా అహూతులను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, జపాన్ ప్రధానులు బోరిస్ జాన్సన్, ఫ్యుమియో కిషిడ సహా ఆయా దేశాధినేతలు హాజరయ్యారు.

G7 statement on Ukraine: Ready to grant or have pledged and provided up to $29.5 Billion

మీటింగ్ హాల్‌కు వెళ్లే సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్.. మోడీ భుజం మీద చెయ్యి వేసి, ఆహ్వానించడం కనిపించింది. అంతకుముందు మోడీ.. జో బైడెన్‌ను కలిశారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడే నిల్చుని ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోనూ మోడీ పలకరించారు. కాగా సమావేశం ప్రారంభానికి ముందు జీ7 దేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. జీ7 దేశాల కూటమి కలిసి ఉక్రెయిన్‌కు 29.5 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయిస్తామని స్పష్టం చేశాయి.

మ్యూనిచ్‌లోని ఓ హోటల్‌లో జీ7 దేశాధినేలు బస చేశారు. అక్కడి నుంచి జర్మనీ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో బవారియన్ ఆల్ప్స్ రీజియన్ పరిధిలోని ఎల్మావ్‌‌కు బయలుదేరి వెళ్లారు. ఆస్ట్రియా సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది ఈ ఎల్మావ్ క్యాజిల్. గతంలో నాజీల వార్ క్యాంప్‌గా ఉండేది. కాలక్రమేణా దాన్ని హోటల్‌, రిసార్ట్స్‌గా తీర్చిదిద్దింది జర్మనీ ప్రభుత్వం. బవారియన్ ఆల్ప్స్ రీజియన్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంటోంది.

English summary
G7 summit is ready to grant or have pledged and provided up to $29.5 Billion of Budget support in 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X