వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాలు షాకింగ్: రెండు నెలలుగా ఆసుపత్రికి కో పైలట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: తన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని జర్మన్ వింగ్స్ ప్రమాదంలో నిందితుడిగా భావిస్తున్న కో పైలట్ ల్యూబిడ్జ్ వ్యాఖ్యానించారు. జర్మన్ వింగ్స్ విమానాన్ని కావాలనే ఆల్ఫ్స్ పర్వతాలకు ఢీకొట్టి ప్రమాదానికి కారణమయ్యాడని భావిస్తిన్న ఆండ్రియాజ్ ల్యూబిడ్జ్ మానసిక స్థితిపై అనుమానాలు తలెత్తేలా జర్మనీ పత్రిక బిల్డ్ ఓ కథనాన్ని శనివారం ప్రచురించింది.

2014లో ల్యూబిడ్జ్‌కు, అతడి ప్రేయసి, ఫ్లైట్ అటెండెంట్ డబ్ల్యూ మరియాకి జరిగిన సంభాషణను బిల్డ్ ప్రచురించింది. బిల్డ్, మరియా కథనం ప్రకారం.. ఏదో ఒక రోజు మొత్తం ఈ వ్యవస్థనే మార్చేసే ఏదో ఒక పని చేస్తానని, దాంతో ప్రతి ఒక్కరు తన గురించి తెలుసుకుంటారని, తన పేరును గుర్తు పెట్టుకుంటారని ల్యూబిడ్జ్ చెప్పారని అందులో పేర్కొన్నారు.

Airbus a320

ఆ రోజు ల్యూబిడ్జ్ దేని గురించి చెప్పాడో సరిగా తెలియదని, ప్రస్తుతం తనకు అవగాహన వచ్చిందని, జర్మన్ వింగ్స్ మాతృసంస్థ లుఫ్తన్సా నుండి సుదూర ప్రాంతాలకు వెళ్లే ఎయిర్ బస్సులకు పైలట్ కావాలనేది అతడి లక్ష్యమని, అతడి ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో దానిని చేరుకోలేనని నిశ్చయించుకొని ఇటువంటి దారుణానికి పాల్పడి ఉంటాడని, చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడటం, ఒత్తిడికి గురయ్యేవడాని ప్రియురాలు చెప్పింది.

దీంతో, జర్మన్‌ వింగ్స్‌ విమానాన్ని కుప్పకూల్చిన కో పైలెట్‌ ల్యూబిట్జ్‌ తీవ్రమైన మానసిక సమస్యతో బాధ పడుతున్నాడని అర్థమవుతోందని అంటున్నారు. ఐదేళ్లుగా అతడు మందులు కూడా వాడుతున్నాడట. అయినా కో పైలెట్‌గా కొనసాగుతున్నాడు.

ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే విమానాన్ని ఆల్ప్స్‌ పర్వత శ్రేణుల్లో కిందికి దించేశాడంటున్నారు. కాక్‌పిట్‌ నుంచి బయటకు వెళ్లిన పైలెట్‌ను మళ్లీ లోపలికి రానివ్వలేదు. స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళుతున్న విమానం మంగళవారం ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్‌ పర్వతాల్లో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 150 మంది మరణించారు.

దీనికి సంబంధించిన బ్లాక్‌ బాక్స్‌ వాయిస్‌ రికార్డరు బుధవారం దొరికింది కూడా. దానిలోని మాటలను పరిశీలించినప్పుడు దర్యాప్తు అధికారులకు ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. అప్పటి వరకు కో పైలెట్‌, పైలెట్‌ ఇద్దరూ సామరస్యంగా, చక్కగా మాట్లాడుకున్నారు. అదే సమయంలో, పైలెట్‌ బాత్‌రూమ్‌కు వెళ్లడానికి కాక్‌పిట్‌ నుంచి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి లోపలికి రావాలని ప్రయత్నించాడు.

కానీ, కో పైలెట్‌ కాక్‌పిట్‌ తలుపును లాక్‌ చేసేశాడు. సాధారణంగా కాక్‌పిట్‌ బయట ఉన్న వ్యక్తి కీ ప్యాడ్‌ లేదా ఎమర్జెన్సీ కోడ్‌ను ఉపయోగించి తలుపును తీయవచ్చు. అయితే, లోపలి నుంచి లాక్‌ చేస్తే మాత్రం ఆ రెండింటినీ ఉపయోగించలేడు. తలుపు తీయాలని చెప్పి పైలెట్‌ అరుస్తున్నా తలుపును బాదుతున్నా విమానాన్ని అదుపులోకి తీసుకోవాలని అరుస్తున్నా లోపల ఉన్న కో పైలెట్‌ ఉలకలేదు. పలకలేదు.

మరోవైపు, ప్రమాదాన్ని గుర్తించిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు పైలెట్‌తో మాట్లాడడానికి శతవిధాలా ప్రయత్నించారు. వారికి కూడా కో పైలెట్‌ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమయంలో కాక్‌పిట్‌లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది.

కాగా, ల్యూబిడ్జ్ 2009 నుంచే తీవ్రమైన మానసిక సమస్యతో బాధ పడుతున్నాడు. ఇప్పటికీ మానసిక వైద్యుల దగ్గర చికిత్స కూడా తీసుకుంటున్నాడు. మరో విషయమేమంటే.. జర్మనీ వైమానిక నియంత్రణ సంస్థకు కూడా ఈ విషయం తెలుసని వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అతనికి ప్రియురాలితో తీవ్రస్థాయిలో మనస్పర్దలు వచ్చాయి. ఆమె అతనికి దూరం కావడంతో మానసిక రోగం మరింత తిరగబెట్టింది. ఇది కూడా ఓ కారణమంటున్నారు. ఈ నేపథ్యంలో, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే విమానాన్ని ఆల్ప్స్‌ పర్వత శ్రేణుల్లో కిందికి దించేశాడు.

రెండు నెలలుగా ఆసుపత్రికి

అతను గత రెండు నెలలుగా మానసిక చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది. విచారణాధికారులకు.. కో పైలట్ ల్యూబిడ్జ్ నివాసంలో సిక్ లీవ్ కనిపించింది. అతను మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు. అయితే, తమ సోదాల్లో సూసైడ్ నోట్ మాత్రం లభించలేదని విచారణాధికారులు చెప్పారు.

యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ డ్యుసెల్‌డోర్ఫ్ తమ స్టెట్మెంట్లో... ల్యూబిడ్జ్ ఫిబ్రవరి 2015 నుండి తమ పేషెంట్ అని, మార్చి 10వ తేదీన మరోసారి ఆసుపత్రికి వచ్చాడని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అతను చికిత్స తీసుకుంటున్నాడని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అయితే, పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అంతేకాకుండా, అతను కంటి చికిత్స చేయించుకోవాలని అడిగినట్లు అధికారులు చెప్పారు.

English summary
The Germanwings incident only goes on to show that solving one problem has led to another. Securing the cockpit to such an extent which only the person inside could open was part of the rule implemented post 9/11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X