జీహాదీలకు సెక్స్ బానిసల ఎర, ఉత్తేజం కోసం విశృంఖల ధోరణులు...

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్‌: మిలిటెం‍ట్లపై తమ నియంత్రణను నిలుపుకునేందుకు ఆయా మిలిటెంట్ సంస్థలు పచ్చి దురాగతాలకు పాల్పడుతున్నాయి. అవి కిడ్నాప్‌ చేసిన మహిళలు, బాలికలను మిలిటెంట్లకు సెక్స్‌ బానిసలుగా మార్చివేస్తున్నాయి.

నాలుగేళ్లు నరకం: రోజూ 30 మంది.. ఆమెను 43 వేలసార్లు రేప్ చేశారు!

జీహాదీ ఫైటర్లను ఆకట్టుకుని, తమ విధ్వంస రచనను కొనసాగించేందుకు ఐఎస్‌, బోకో హరమ్‌ సంస్థలు మహిళలు, బాలికలను వారికి ఎరగా వేస్తున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థల దురాగతాలను బ్రిటన్‌కు చెందిన హెన్రీ జాక్సన్‌ ఓ నివేదికలో వెల్లడించింది.

లైంగిక వేధింపుల్లోనూ ఉన్మాదం...

లైంగిక వేధింపుల్లోనూ ఉన్మాదం...

కొత్తగా ఉగ్రవాద సంస్థల్లోకి రిక్రూట్‌ చేసుకునే యువతకు, విదేశాల్లో ధ్వంస రచనలో నిమగ్నమైన వారికి ఉత్తేజం కలిగించేందుకు మహిళలను భార్యలుగా, సెక్స్‌ బానిసలుగా ఎరవేస్తున్నారని రీసెర్చర్‌ నికితా మాలిక్‌ ఒక నివేదికలో పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు తమ ఉన్మాద చర్యల్లోకి లైంగిక వేధింపుల పర్వాన్ని కూడా తీసుకువచ్చాయని వ్యాఖ్యానించారు.

నరకకూపంలో మగ్గుతూ...

నరకకూపంలో మగ్గుతూ...

నైజీరియాలోని బోకోహరం, సిరియాలో ఐసిస్ సంస్థలు ఇలాంటి విశృంఖల ధోరణులతో సాగుతున్నాయి. 2009లో బోకోహరం ఇస్లామిస్ట్‌ మిలిటెంట్లు నైజీరియాలోని వేలాది మహిళలు, బాలికలను అపహరించగా వారంతా నరకకూపంలో ముగ్గుతున్నారు.

జీహాదీల తయారీ ప్రక్రియలో...

జీహాదీల తయారీ ప్రక్రియలో...

మరో ఉగ్రవాద సంస్థ బోకోహరామ్‌.. 2014 ఏప్రిల్‌లో ఓ స్కూల్‌ నుంచి 200 మందికి పైగా బాలికలను కిడ్నాప్ చేసింది. వారిని కుక్‌లు, సెక్స్‌ బానిసలు, చివరికి ఆత్మాహుతి బాంబర్లుగా మార్చివేసింది. ఈ ఉగ్ర సంస్థ కొత్త జీహాదీలను తయారుచేసే ప్రక్రియలో భాగంగా వారిని మరింత ఉత్తేజితుల్ని చేయడం కోసం అమాయక బాలికలు, మహిళలను వాడుకుంటోంది.

నిత్యం నరకం...

నిత్యం నరకం...

2014లోనే సిరియాలోని సింజార్‌కు సమీపంలోని ఓ గ్రామాన్ని చుట్టుముట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాదాపు 5000 మంది యాజిదీలను ఊచకోత కోశారు. అంతేకాకుండా 7000 మంది మహిళలు, బాలికలను అపహరించారు. అనంతరం వీరిని బలవంతంగా సెక్స్ బానిసలుగా మార్చేసినట్లు తెలుస్తోంది. వీరంతా ఐఎస్‌ మిలిటెంట్ల వికృత చేష్టలతో నిత్యం నరకం చవిచూస్తున్నారు.

డబ్బు కోసం అమ్మాయిల ఎర...

డబ్బు కోసం అమ్మాయిల ఎర...

ఐఎస్‌, బోకోహరామ్‌ ఉగ్ర సంస్థలు నిధుల ఊతం లభించకపోవడంతో తమ ఆపరేషన్లను కొనసాగించలేక సెక్స్‌ ట్రాఫికింగ్‌, భారీ మొత్తాలను డిమాండ్‌ చూస్తూ కిడ్నాపింగ్‌లకు దిగుతున్నాయి. డబ్బు కోసం అమ్మాయిలను ఎరగా వేస్తున్నాయి. సంప్రదాయంగా ఈ ఉగ్ర సంస్థలకు అందే నిధులు పలు కారణాలతో నిలిచిపోవడంతో ఈ చర్యలకు పాల్పడుతున్నాయి. 2016లో కిడ్నాప్‌ల ద్వారా ఐసిస్ 3 కోట్ల డాలర్లను ఆర్జించినట్టు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Terrorists are using slaves to generate funding and attract recruits including domestic abusers and rapists, research has found. A report published by think-tank the Henry Jackson Society (HJS) warned that modern slavery and sexual violence was fuelling Isis and other groups operating across Africa and the Middle East. Nikita Malik, the report’s author and a senior research fellow, said the sectors are routinely treated separately by different global agencies but are increasingly interlinked.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి