వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతిపెద్ద బ్యాక్టీరియా..సేమియా షేప్‌లో: ఏకకణ జీవుల్లో ఎవరెస్ట్

|
Google Oneindia TeluguNews

పారిస్: బ్యాక్టీరియాలనేవి ఏకకణ సూక్ష్మజీవులు. సాధారణంగా అవేవీ మన కంటికి కనిపించవు. ల్యాబొరేటరీల్లో ఉపయోగించే ఆప్టికల్ మైక్రోస్కోప్ వంటి పరికరాల ద్వారానే వాటిని చూసే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ పరిమాణంలో అంటే 1 నుంచి 5 మైక్రోమీటర్ల పొడవును కలిగివుంటాయవి. ఒక అసాధారణ శరీర నిర్మాణం వాటి సొంతం. ఎలాంటి వాతావరణంలోనైనా అవి జీవించగలవు. అతి శీతల, అతి ఉష్ణ పరిస్థితులను కూడా తట్టుకొని బ్యాక్టీరియాలు మనుగడ కొనసాగించగలవు.

750 మైక్రోమీటర్ల పొడవుతో..

750 మైక్రోమీటర్ల పొడవుతో..

తాజాగా- శాస్త్రవేత్తలు కనుగొన్న బ్యాక్టీరియా వీటన్నింటికి కంటే భిన్నం. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియా ఇది. బ్యాక్టీరియాల్లో ఎవరెస్ట్‌గా చెప్పుకోవచ్చు. దీని శరీర నిర్మాణం ఎంత భిన్నమైనదంటే.. దాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా నేరుగా చూడొచ్చు. కంటికి కనిపించేంత పొడవును కలిగి ఉందా బ్యాక్టీరియా శరీరం. దీని పొడవు 750 మైక్రో మీటర్లు. ఇంత పొడవాటి శరీరం ఉన్న బ్యాక్టీరియా ఇప్పటివరకు లేదు. సైంటిస్టులు తొలిసారిగా దీన్ని కనుగొన్నారు. ఆకారంలో చూడ్డానికి ఇది సేమియా షేప్‌ను కలిగివుంది.

పేరేమిటంటే..

పేరేమిటంటే..

కరేబియన్ సముద్రంలోని గ్వాడెలొపె అనే ద్వీపంలో శాస్త్రవేత్తలు ఈ బాక్టీరియాను గుర్తించారు. ఫ్రంచ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందీ ద్వీపం. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు ఈ పొడవాటి బాక్టీరియాను కనుగొన్నారు. దీనికి థియోమార్గరిట మాగ్నిఫికా (Thiomargarita magnifica) అనే పేరు పెట్టారు. ఇప్పటివరకు అతిపెద్ద బాక్టీరియాలుగా చెప్పుకొన్న వాటికి 50 రెట్లు పెద్దగా ఉంటుంది దీని పొడవు. ఎలాంటి పరికరాలు, మైక్రోస్కోప్‌లు లేకుండా నేరుగా దీన్ని చూడవచ్చు.

జర్నల్ సైన్స్‌లో..

జర్నల్ సైన్స్‌లో..

ఈ బాక్టీరియాకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను జర్నల్ సైన్స్‌లో ప్రచురించారు సైంటిస్టులు. హైలీ పాలిప్లాయిడ్ సెల్స్ దీని సొంతం. డీఎన్ఏ మొత్తం కంపార్ట్‌మెంటలైజ్డ్‌గా పొరలు పొరలుగా విడిపోయి ఉన్నట్లు యూనివర్శిటీ ఆఫ్ ద ఫ్రెంచ్ వెస్టిండీస్ అండ్ గయానా బయాలజిస్ట్ ఒలివర్ గ్రోస్ తెలిపారు. ఈ విషయాన్ని జర్నల్ సైన్స్‌లో పొందుపరిచారు. గ్వాడెలొపో ద్వీపంలో సముద్రతీరంలో ఉన్న మ్యాన్‌గ్రోవ్ ఆకుల్లో ఇది వృద్ధి చెందుతున్నట్లు చెప్పారు.

చిత్తడి నేలలు..

చిత్తడి నేలలు..


తొలిసారిగా 2009లో దీన్ని గుర్తించినప్పటికీ.. బ్యాక్టీరియంగా భావించలేదని వ్యాఖ్యానించారు. ఏకకణ శరీర నిర్మాణంతో 0.9 సెంటీమీటర్ల కంటే మూడింతలు పెద్దగా ఉన్నట్లు చెప్పారు. మ్యాన్‌గ్రోవ్ ఆకులు, ఆల్చిప్పలు, నీటిలో మునిగివున్న బండరాళ్లు, చిత్తడి నేలల్లో ఈ థియోమార్గరిట మాగ్నిఫికా అతిపెద్ద బాక్టీరియాను గుర్తించినట్లు ఒలివర్ గ్రోస్ వివరించారు. సాధారణ బాక్టీరియాల్లో ఉండే కణాలకు భిన్నంగా దీని నిర్మాణం ఉందని చెప్పారు.

కీలక మలుపుగా..

కీలక మలుపుగా..

ఈ ఉదంతాన్ని బ్యాక్టీరియాలపై కొనసాగుతున్న పరిశోధనల్లో కీలక మలుపుగా సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ మైక్రోబయాలజిస్ట్ పెట్రా లెవిన్ అభివర్ణించారు. ఇలాంటివి మరిన్ని ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అతిపెద్ద బాక్టీరియా లాబొరేటరీ తరహా వాతావరణంలో మనుగడ సాగించగలుగుతుందా? లేదా? అనేది పరిశోధన చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. బాక్టీరియాలను కూడా తక్కువ అంచనా వేయకూడదనే సందేశాన్ని పంపించినట్టయిందని అన్నారు.

English summary
The bacterium has been found in several locations in Guadeloupe. The largest-known bacterium until now had a maximum length around 750 micrometers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X