లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే!
పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు బిగ్ షాక్ తగిలింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాలో కీలక కమాండర్‌గా ఉన్న బిలాల్ ఆరిఫ్ సరాఫీ దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రంజాన్ ప్రార్థనల అనంతరం ఆయన సొంత కుటుంబ సభ్యులే బిలాల్‌ను కత్తులతో పొడిచి, ఆపై తుపాకీతో కాల్చి చంపినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
మురిడ్కేలో ఘటన.. కుటుంబ కలహాలే కారణమా?
ఈ హత్య పాకిస్థాన్‌లోని మురిడ్కే ప్రాంతంలో ఉన్న లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం సమీపంలోనే జరిగినట్లు సమాచారం. లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఇది కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదం కారణంగానే జరిగి ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానుస్తున్నాయి. ఈ హత్యకు పాల్పడిన వారిని ఇప్పటికే పాక్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

బ్రెయిన్ వాషింగ్లో బిలాల్ సిద్ధహస్తుడు
బిలాల్ ఆరిఫ్ సరాఫీ లష్కరే తోయిబాలో రిక్రూట్మెంట్ విభాగంలో కీలక పాత్ర పోషించేవాడు. మురిడ్కే కేంద్రంగా యువకులను గుర్తించి.. వారిని ఉగ్రవాదం వైపు మళ్లించడం బిలాల్ ప్రధాన బాధ్యత. యువతకు భావజాల శిక్షణ ఇచ్చి.. వారిని బ్రెయిన్ వాష్ చేయడంలో బిలాల్ సిద్ధహస్తుడని నివేదికలు చెబుతున్నాయి. అయితే భారత్‌లో బిలాల్‌పై ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్ర రిస్క్
ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్.. ఇప్పుడు అదే ఉగ్రవాదం కోరల్లో చిక్కుకుంటోంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం.. ప్రపంచంలో ఉగ్రవాదంతో అత్యధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. 2025లో పాక్‌లో మొత్తం 1,045 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో 1,139 మంది మరణించగా.. 1,595 మంది గాయపడ్డారు. ప్రధానం ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో 74 శాతం దాడులు జరుగుతున్నాయి.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..!












Click it and Unblock the Notifications