వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై దాడికి లష్కరే స్కెచ్: జమ్మూ సరిహద్దులో మకాం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత్ మీద దాడి చెయ్యడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. జమ్మూకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాటు వేసిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు సమయం చూసి భారత్ లోకి చోరబడాలని ప్రయత్నిస్తున్నారు.

లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను భారత సరిహద్దులు దాటించడానికి పాక్ సైనికులు సహకరిస్తున్నారని ఇంటిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. జమ్మూకు మూడు కిలోమీటర్ల దూరంలోని పాకిస్గాన్ భూ భాగంలో ఉన్న బడాబాయ్ మస్రూర్, భియాల్ డోగ్రా, ఛాఫ్రార్, సుక్కాల్, చర్క్ భోరా ప్రాంతాలలో ఉగ్రవాదులు మకాం వేశారని ఇంటిలిజెన్స వర్గాలు గుర్తించాయి.

పాక్ ఉగ్రవాదులు ముంబాయిలో దాడులు చెయ్యడానికి ప్రధాన కారణం అయిన నిందితుడు, దాడుల రూపకర్త హఫీజ్ సయ్యద్ మళ్లి భారత్ లోని ప్రముఖ నగరాల మీద దాడులు చెయ్యాలని స్కెచ్ వేశాడని వెలుగు చూసింది. హఫీజ్ సయ్యద్ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు జమ్మూ సరిహద్దులో మకాం వేశారు.

LET plans to attack India from Pak boarder

సరైన సమయంలో చూసి భారత్ లోకి చొరబడి విధ్వంసాలు స్పృష్టించాలని భావిస్తున్నారు. భారత్ సరిహద్దులోని పాకిస్థాన్ భూభాగంలో లష్కర్ ఉగ్రవాదులు 10 ఉగ్రవాద శిక్షణా శిభిరాలు ఏర్పాటు చేశారు. వారు భారత్ భూభాగంలోకి ప్రవేశించడానికి పాక్ సైన్యంతో పాటు పాకిస్థాన్ లోని తెహ్రిక్ -ఏ-తాలిబన్ ఉగ్రవాదులు సహకరిస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెలుగు చూసింది.

ఇద్దరు కాల్చివేత...... రూ. 60 కోట్ల హెరాయిన్ స్వాదీనం

భారత్ భూ భాగంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు అంతం చేశాయి. పాక్ సరిహద్దులోని అమృత్ సర్ దగ్గర జరిగిన ఈ కాల్పులలో పాక్ ఉగ్రవాదులు ఇద్దరు హతమయ్యారు. వీరి నుండి రూ. 60 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్, ఏకే-47 ఆయుధం స్వాదీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ డిఐజీ ఆర్.పీ.ఎస్. జస్వాల్ తెలిపారు.

English summary
Terror is practically at our gate. The jehad machine in Pakistan has set up new launch pads within striking distance from the International Border
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X