వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్ 370: మలేషియా విమానం ఎప్పటికైనా దొరుకుతుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

2014 మార్చిలో మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైంది. ఇందులో సిబ్బందితో కలిపి 239 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ విమానం జాడ లభించలేదు. ఈ విమాన ప్రమాదం ప్రపంచంలోనే ఒక రహస్యంగా మిగిలిపోయింది.

దీనిపై ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేసిన బ్రిటిష్ ఏరోనాటికల్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్‌ఫ్రే మాత్రం ఈ విమానం ఎక్కడ కూలిందో సరిగ్గా అంచనా వేశానని అంటున్నారు.

ఈయన కనిపెట్టిన సమాచారం ఆధారంగా ఈ విమాన ప్రమాదం జరిగిన తీరు గురించి మృతుల కుటుంబాలకు, సంబంధీకులకు వివరాలిచ్చి ప్రమాదం జరిగిన తీరును ఒక కొలిక్కి తీసుకుని రావచ్చని గాడ్‌ఫ్రే బీబీసీతో అన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించవచ్చో కూడా తెలుస్తుందని అన్నారు.

అన్ని రకాల సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత, దక్షిణ హిందూ మహా సముద్రంలో విమానం కూలి ఉండవచ్చని అంచనా వేశారు.

"ఇది చాలా క్లిష్టమైన పని. కానీ వివిధ విభాగాలను అనుసంధానించి గతంలో పరిశీలించలేదు" అని చెప్పారు.

ఇన్‌మార్‌సాట్ శాటిలైట్ సమాచారం, బోయింగ్ పెర్ఫార్మన్స్ డేటా, సముద్ర ఉపరితలంపై తేలుతున్న వ్యర్ధాల డేటా , డబ్ల్యూఎస్‌పీఆర్ నెట్ డేటాతో కలిపి ప్రమాదం జరిగిన స్థలాన్ని గుర్తించవచ్చనే ఆలోచన ఎవరికీ రాలేదని అంటారు గాడ్‌ఫ్రే.

ఒక సంవత్సర కాలంగా ఈ విషయం గురించి ఆయన బృందం పని చేస్తోందని చెప్పారు.

"కొత్తగా వచ్చిన ఈ ఆలోచన గురించి చాలా పరీక్షలు నిర్వహించి, ఆ పరిజ్ఞానాన్ని ఎంహెచ్ 370కి కూడా అప్లై చేశాం" అని చెప్పారు.

ఇది గడ్డివాములో పడిన సూదిని వెతకడంలాంటిదే

రిచర్డ్ బృందం పరిశీలించిన డేటా ప్రకారం ఈ విమానం ఇండియన్ ఓషియన్‌లో 33 డిగ్రీల దక్షిణానికి గాని, 95 డిగ్రీల తూర్పు వైపుగానీ కూలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇండియన్ ఓషియన్‌లో ఎంహెచ్ 370 కోసం విస్తృతంగా గాలించారు. కానీ, ఆ చర్యలు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు.

ఈ గాలింపు చర్యలకు కొన్ని లక్షల డాలర్లు ఖర్చయ్యాయి. మరోవైపు ప్రయాణీకుల కుటుంబ సభ్యులు తమ ఆప్తులను వెతికి వారి వివరాలను తెలియచేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి భారీగా ఖర్చవుతుంది.

నమ్మదగిన ఆధారాలు

మలేషియాకు చెందిన గ్రేస్ నథాన్ ఈ ప్రమాదంలో ఆమె తల్లిని కోల్పోయారు. నాథన్ కౌలాలంపూర్‌లో క్రిమినల్ డిఫెన్స్ న్యాయవాదిగా పని చేస్తున్నారు.

"ఇది నిరంతరం కొనసాగుతున్న పీడకలలా ఉంది. దీనికి ముగింపు కనిపించటం లేదు"

"ఏదైనా ఆచూకీ లభిస్తుందేమోనని ఎప్పటి నుంచో ఆశిస్తున్నాం. ఏదైనా ఆధారం లభించి గాలింపు చర్యలు తిరిగి చేపడతారేమోనని ఎదురు చూస్తున్నాం. విమానాన్ని కనిపెడతారేమోనని చూస్తున్నాం" అని ఆమె బీబీసీకి చెప్పారు.

కొత్తగా లభించిన సమాచారాన్ని సైన్స్, ఫిజిక్స్‌ను అర్థం చేసుకోగలిగిన వైమానిక రంగ నిపుణులు పరిశీలించి ఈ సిద్ధాంతం ఎంత వరకు నమ్మవచ్చో చూడాలని కోరుతున్నారు.

"కొత్తగా కనిపెట్టిన సమాచారాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం లభించిన డేటాను అంచనా వేయవచ్చు. ఇది కేవలం గూగుల్ ఫోటోలు లేదా గాలి మాటలతో చెబుతున్న విషయం కాదు" అని అన్నారు.

విమానం కూలిన ప్రాంత విస్తీర్ణం పెద్దదిగా ఉండటంతో గతంలో ఎంహెచ్370 కోసం చేపట్టిన గాలింపు చర్యలు చాలా కష్టతరం అయ్యాయి.

ఈ విమానం కోసం సుమారు 120,000 చదరపు కిలోమీటర్ల మేర గాలించారు. అది కేవలం గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది కాదు. గడ్డివాములో మరింత సూక్ష్మమైన పదార్ధాన్ని వెతకడం లాంటిది. అది చాలా కష్టంతో కూడుకున్న పని" అని గాడ్‌ఫ్రే అన్నారు.

4000 మీటర్ల లోతు

గతంలో నిర్వహించిన గాలింపు చర్యల కంటే తక్కువ ప్రదేశంలో.. కొత్త సిద్ధాంతం ప్రకారం 40 నాటికల్ మైళ్ల రేడియస్‌లోనే గాలింపు చర్యలు చేపట్టవచ్చని ఇంజనీర్లు ప్రతిపాదిస్తున్నారు.

విమానం శిథిలాలు ఏదైనా శిఖరం వెనుక కానీ, లేదా లోయ లేదా సముద్ర గర్భంలో కానీ పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

"అయితే వీటిని కనిపెట్టేందుకు మూడు నుంచి నాలుగు అంచెలు దాటాల్సి ఉంటుంది. ఈ శిథిలాలు కనీసం 4000 మీటర్ల లోతులో ఉండి ఉండవచ్చు" అని చెప్పారు. 30కు పైగా విమాన శిథిలాలు ఆఫ్రికా తీరం, ఇండియన్ ఓషియన్ దీవుల తీరానికి కొట్టుకు వచ్చాయి.

2009లో గాడ్‌ఫ్రే కూడా ఎయిర్ ఫ్రాన్స్ 447 విమానంలో రియో డి జనిరో నుంచి పారిస్‌కు ప్రయాణించాల్సి ఉంది. కానీ, ఆయన బ్రెజిల్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఆ విమానం గమ్యం చేరలేదు. అట్లాంటిక్‌లో కూలిపోయింది. అప్పటి నుంచి ఆయనకు సముద్రంలో కూలిపోయిన విమానాలను కనిపెట్టాలనే ఆసక్తి పెరిగింది.

ఆయన ఎంహెచ్ 370 ఇండిపెండెంట్ గ్రూప్ వ్యవస్థాపక సభ్యుడు. ఆయనకు ఎయిర్ క్రాఫ్ట్ ఆటోమేటిక్ ల్యాండింగ్ సిస్టమ్స్, ఆటో పైలట్ సిస్టమ్స్ గురించి అనుభవం ఉంది. ఆయన ఇంజనీర్ కూడా.

"నేను ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మీద పని చేశాను. చాలా డేటాతో పని చేస్తాను. ఈ విశ్లేషణకు అది బాగా ఉపయోగపడింది" అని అన్నారు.

ఏవియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్స్‌లో డేవిడ్ గ్లీవ్ చీఫ్ ఇన్వెస్టిగేటర్‌గా పని చేస్తున్నారు.

ఆయన కొన్ని దశాబ్దాల పాటు కనిపించకుండా పోయిన విమానాలు కూలిపోయిన విధానం గురించి అధ్యయనం చేశారు.

"కొత్తగా గాలింపు చర్యలు చేపట్టాలంటే నిధులు చాలా పెద్ద సమస్య. ప్రస్తుతం లభించిన సమాచారం నమ్మశక్యంగా ఉంది" అని అన్నారు.

సముద్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రత్యేకంగా రూపొందించిన పరికరాల అందుబాటు మీద ఈ గాలింపు చర్యలు ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయం ఆధారపడి ఉంటుంది.

ఇండియన్ ఓషియన్ దీవి లా రీయూనియన్ లో కనిపించిన విమాన శిధిలాలను పరిశీలిస్తున్న ఫ్రెంచ్ పోలీసులు

స్థిరమైన ఆధారం

"దక్షిణ ప్రాంతంలో వేసవి కాలంలో గాలింపు చర్యలు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ గాలింపు చర్యలు మరో 12 నెలల్లో మొదలుకావచ్చు. వీటికి కావలసిన పరికరాలు, సాంకేతికత సమకూర్చుకునేందుకు సమయం పడుతుంది" అని అన్నారు.

"చైనా కూడా బాధితుల గురించి బాధ్యత తీసుకుంటుందని భావిస్తున్నాను. లేదా ప్రైవేటు సంస్థలు గాలింపు చర్యలు చేపట్టవచ్చు. ఇందుకు ఇన్సూరెన్స్ సంస్థల సహాయం తీసుకోవచ్చు" అని అన్నారు.

ఎంహెచ్ 370లో 122 మంది చైనా దేశస్థులు ఉన్నారు. ఈ విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ చేరాల్సి ఉంది.

ఈ విమానం కనిపించకుండా పోవడంతో అనేక రకాల కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పైలట్ హైజాక్ చేసి విమానాన్ని ఆధీనంలోకి తీసుకుని, గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ దగ్గర మలుపు తీసుకునేటప్పుడు రాడార్ సాంకేతికతను నిలిపివేసి ఉంటారని కూడా అన్నారు.

"దక్షిణ ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో విమానాన్ని దాచిపెట్టి ఉంచాలంటే, విమానం సాధారణంగా ప్రయాణించే మార్గానికి పశ్చిమంగా వెళ్ళాలి. ఇది ఆస్ట్రేలియా సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాల ఎయిర్ క్రాఫ్ట్ గాలింపు చర్యలు చేపట్టిన ప్రాంతానికి చాలా దూరంలో ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇదొక నమ్మదగిన ఆధారంలా ఉంది" అని గ్లీవ్ అన్నారు.

ఎంహెచ్ 370 కోసం ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు నిర్వహించిన సముద్రగర్భంలో గాలింపు చర్యలు అక్టోబర్ 2017లో ముగిశాయి.

ఆ తర్వాత విమానం కోసం ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదని ఆ సంస్థ బీబీసీతో చెప్పింది. విమానం కోసం వెతికే నిర్ణయాన్ని మలేషియా ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు.

దీనికి సమాధానం కోసం మలేషియా, చైనా ప్రభుత్వాలను బీబీసీ సంప్రదించింది.

"ఈ ప్రమాదానికి ఒక ముగింపు పలకడం కేవలం మా ఒక్కరి అవసరం మాత్రం కాదు" అని గ్రేస్ నాథన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
MH 370: When will the Malaysian flight be found
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X