మిమ్మల్ని నల్లుల్ని నలిపినట్టు నలిపేస్తాం- పాకిస్తాన్ ప్రధాని
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరమౌతోంది. అఫ్ఘానిస్తాన్‌లోని పలు నగరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పలు పేలుళ్లు సంభవించాయి. విమానాల శబ్దాలు వినిపించాయి. మిస్సైళ్ల మోతలతో ఉలిక్కిపడింది కాబుల్. మరో ప్రధాన నగరం కాందహార్ తో పాటు పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటోన్న పక్టికాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మెరుపుదాడులతో ఆప్ఘనిస్తాన్ నగరాలు అట్టుడికిపోయాయి.
దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం. సరిహద్దులపై విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన పలు క్యాంప్ లను స్వాధీనం చేసుకుంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన జేఎఫ్-17 పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని ఆఫ్ఘన్ బలగాలు కూల్చివేశాయి. తూర్పు, ఆగ్నేయ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నాలుగు గంటల ఆపరేషన్‌లో రెండు పాక్ సైనిక స్థావరాలు, 19 అవుట్‌పోస్టులు ధ్వంసం అయ్యాయి. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాయి.

ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెర మీదికి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తాలిబన్లను దురాక్రమణదారులుగా అభివర్ణించారు. తమ సాయుధ బలగాలు వారిని చిత్తు చేయగలవని తేల్చి చెప్పారు. తాలిబన్లను నలిపేస్తామని స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే తమ సైన్యం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సరిహద్దులు దాటుకుని ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై మరిన్ని దాడులు ఉంటాయని అన్నారు.
తమ బలగాలకు ఎలాంటి దురాక్రమణ ఆశయాలనైనా అణచివేసే పూర్తి సామర్థ్యం ఉందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వ ఎక్స్ ఖాతాలో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. దేశ ప్రజలందరూ తమ సాయుధ బలగాలకు భుజం భుజం కలిపి నిలబడతారని చెప్పారు. వెనుకంజ వేసే ప్రసక్తే ఉండబోదని అన్నారు.
సరిహద్దులను పంచుకుంటోన్న ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్టయింది.. తాజా దాడులతో. వివాదాస్పద డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ గుర్తించకపోవడం, తాలిబన్ ప్రోత్సాహిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింపజేయడం ఈ పరిణామాలకు దారి తీసింది. కొద్దిరోజుల కిందటే ఈ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడిది యుద్ధం దాకా వెళ్లింది.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications