Viral Video: జీ20 సదస్సులో 'మెలోడీ' చిరునవ్వులు
Viral Video: ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. వారు అంతర్జాతీయ వేదికలపై కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటారు. అనేక సందర్భాల్లో వారు కలుసుకున్న దృశ్యాలు 'మెలోడీ' పేరుతో నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. G20 లీడర్స్ సమ్మిట్ ప్రారంభ సెషన్‌కు ముందు జోహన్నెస్‌బర్గ్‌లోని నాస్రెక్ వద్ద ఇద్దరు అగ్రనేతలు కరచాలనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మెలోని ఎదురుపడడంతో మోదీ చిరునవ్వులు చిందిస్తూ ఆత్మీయంగా పలకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి.
#WATCH | Johannesburg, South Africa | Prime Minister Narendra Modi interacts with Italian Prime Minister Giorgia Meloni during the G-20 Summit
— ANI (@ANI) November 22, 2025
(Source: DD News) pic.twitter.com/a4DvBgOLmD
బంధాన్ని బలోపేతం చేసిన 'ఐ యామ్ జార్జియా' పుస్తకం
ప్రధాని మోదీ, జార్జియా మెలోని చివరిసారిగా జూన్‌లో కెనడాలోని కనానాస్కిస్‌లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య బలమైన సంబంధాలకు నిదర్శనంగా, ప్రధాని మోదీ జార్జియా మెలోని ఆత్మకథ అయిన 'ఐ యామ్ జార్జియా' పుస్తకానికి రాసిన ముందుమాట అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ ముందుమాటలో ప్రధాని మోదీ భారత్, ఇటలీ మధ్య ఉన్న సాన్నిహిత్యం "పంచుకోబడిన నాగరికత ప్రవృత్తులు" అంటే వారసత్వాన్ని పరిరక్షించడం, సమాజంలోని బలం,'గైడింగ్ ఫోర్స్'గా స్త్రీత్వం ఔన్నత్యాన్ని చాటడం వంటి అంశాలపై ఆధారపడి ఉందని రాశారు.

జార్జియా మెలోని స్పందన
ప్రధాని మోదీ రాసిన ముందుమాటపై జార్జియా మెలోని స్పందిస్తూ.. "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగారు 'ఐ యామ్ జార్జియా' పుస్తకం భారతీయ ఎడిషన్‌కు రాసిన ముందుమాట నాకు ఎంతో గౌరవాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. ఆయనపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఈ భావాలు నేను మనస్ఫూర్తిగా తిరిగి తెలియజేస్తున్నాను, ఇది మన రెండు దేశాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని ధ్రువీకరిస్తుంది" అని ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ Adnkronos ద్వారా పేర్కొన్నారు.
జీ20 సదస్సులో ప్రముఖులు
జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ G20 సమావేశానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రీమియర్ లీ కియాంగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సహా పలువురు ప్రపంచ నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు బహిష్కరించారు. వర్తకం, వాతావరణ మార్పులపై ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం వంటి దక్షిణాఫ్రికా ప్రాధాన్యతలు అమెరికా విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ప్రభుత్వం పేర్కొంది.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
విజయ్ సంచలన నిర్ణయం.. తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ !! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications