ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ
సీఈవోలతో మీట్ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో సమావేశం అయ్యారు. వాషింగ్టన్ డీసీలో కొనసాగుతోన్న సమావేశంలో.. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుగుతుంది. వర్తక, వాణిజ్యం, సరిహద్దు భద్రతపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రధాని మోడీ మీట్ అవుతారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో మోడీ వెల్లడించారు.

ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు.
ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.
Recommended Video
అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్తాన్ అనుమతించింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళితే తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాక్ నిరాకరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ ధోరణిపై భారత్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్‌లో తన నిరసన గళాన్ని వినిపించింది. అఫ్గానిస్తాన్ గగనతలం సురక్షితం కాదు కాబట్టి ఈసారి ప్రధాని మోడీ విమానానికి పాక్ అనుమతించింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications