వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, పవర్ హౌజ్‌లే టార్గెట్, అంధకారంగా కొన్ని నగరాలు

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని స్థలాలు/ సముదాయాల లక్ష్యంగా అటాక్ చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ విద్యుత్ సముదాయాలే లక్ష్యంగా రష్యా దాడికి తెగబడింది. దీంతో ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలు ఖర్కీవ్, లివిన్ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంత ప్రజలు చీమ్మ చీకటిలో ఉంటున్నారు. మరోవైపు అక్కడ విద్యుత్ పునరుద్దరణ కోసం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

రష్యా దాడుల తర్వాత చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. కానీ త్వరలోనే పునరుద్దరణ జరుగుతుందని తెలిపారు.శీతకాలం ఉండగా.. జనం బయటకు రాలేన పరిస్థితి నెలకొంటుంది. అందుకే లక్ష్యం చేసుకొని.. దాడులు చేస్తోంది. గతవారం ఖేర్సన్ నగరాన్ని ఉక్రెయిన్ పొందిన సంగతి తెలిసిందే. 9 నెలల తర్వాత రష్యా కబంధ హస్తాల నుంచి బయటపడింది. దాంతో రష్యా మిగతా నగరాల్లో కూడా దాడులు తెగబడుతోంది. జెలెన్ స్కీ సొంత నగరంపై కూడా దాడులు జరిగాయి.

 Power off in multiple Ukrainian cities

అంతకుముందు ఖేర్సన్ సమీపంలో ఉక్రెయిన్ దాడి చేసింది. దీంతో డిప్నొర్ నదీ పశ్చిమ తీరం నుంచి దళాలను విత్ డ్రా చేసుకుంటున్నామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు. దీనిపై ఉక్రెయిన్ స్పందించింది. ఇప్పటికీ కొన్ని రష్యా దళాలు ఖేర్సన్‌లో ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ రాయిటర్ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు.

ఖేర్సన్‌లో ఉక్రెయిన్ జెండా ఎగరవేసే వరకు రష్యా తమ దళాల ఉపసంహరణ గురించి మాట్లాడటంలో అర్థం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సీనియర్ సలహాదారు మెఖైల్ పోడోల్యాక్ మీడియాకు తెలిపారు. ఖేర్సన్‌ను రష్యా ఫిబ్రవరిలో ఆక్రమించుకుంది. దీనిని ప్రత్యేక సైనిక చర్యగా రష్యా అప్పుడే ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు విడిచి వెళ్లడం అగ్రదేశానికి ఎదురుదెబ్బే అవుతుంది. ఆ క్రమంలోనే రష్యా విరుచుకుపడుతుంది.

English summary
Russian airstrikes rocked Ukraine on Tuesday, with authorities from east to west reporting attacks on energy and other facilities that knocked out power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X