వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా, క్లైమెట్ ఛేంజ్ ఛాలెంజ్: క్వాడ్ సదస్సులో ప్రధాని మోడీ, బైడెన్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నిర్మూలన, వాతావరణ మార్పులపై క్వాడ్‌లో కీలక అంశంగా చర్చించారు. క్వాడ్ హోస్టింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశానికి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా హాజరయ్యారు. 2004లో ఇండో ఫసిఫిక్ రీజియన్‌లో సునామీ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో క్వాడ్‌కు చెందిన దేశాధినేతలు సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మీట్ అయ్యారు.

 Quad Will Work As Force For Global Good: PM modi

యావత్ ప్రపంచం కరోనాతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని.. మోడీ తెలిపారు. ప్రపంచంలో శాంతి, సౌభ్రాతుత్వం పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అన్నీ దేశాలు కరోనా, వాతావరణ మార్పులపై కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని అమెరికా అధినేత జో బైడెన్ అన్నారు. ఆప్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చామని.. ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Recommended Video

PM Modi In US 5G - Had Meetings With Qualcomm CEO, Blackstone Group CEO

ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.

English summary
Prime Minister Narendra Modi said he was "confident that our participation in Quad will establish peace and prosperity in the world"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X