రిలయన్స్‌కు 10శాతమే, హెచ్ఏఎల్‌ని కాదని..: రాఫెల్ ఒప్పందంపై తేల్చేసిన డసో సీఈఓ
ప్యారిస్: రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ తోపాటు విపక్ష పార్టీలు కేంద్రంపై విమర్శల దాడిని తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షు రాహుల్ గాంధీ అయితే నేరుగా ప్రధాని నరేంద్ర మోడీపైనే విమర్శలను ఎక్కుపెట్టారు.

రిలయన్స్‌కు 10శాతమే
ఈ నేపథ్యంలో రాఫెల్ ఒప్పందంపై తాజాగా ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్(డసో) సంస్థ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రేపియర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్‌తో డసో ఉమ్మడి భాగస్వామ్యం కేవలం 10శాతం మాత్రమేనని ఎరిక్ స్పష్టం చేశారు. ఒప్పందం కోసం మరో 100 భారత కంపెనీలతో తాము చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

మరో వంద కంపెనీలతో..
‘భారత సంస్థలు విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలంటే అది భారత చట్టాలకు లోబడి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా నాగ్‌పూర్‌లో ప్లాంట్‌ను నిర్మించేందుకు డసో ఏవియేషన్.. రిలయన్స్‌తో కిలిసి జాయింట్ వెంచర్ చేపట్టింది. రాఫెల్ డీల్‌కు సంబంధించిన వ్యవహారంలో ఇది కేవలం 10శాతం మాత్రమే. మరో 100 భారత కంపెనీలతో మేం చర్చలు జరుపుతున్నాం. ఇందులో దాదాపు 30కంపెనీలతో ఇప్పటికే భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నాం' అని ఎరిక్ తెలిపారు.

హెచ్ఏల్‌ని కాదని ఎందుకు?
అయితే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు బదులు రిలయన్స్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నారనే ప్రశ్నకు స్పందించిన ఎరిక్.. ‘డసో రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్(డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ ద్వారా భారత్‌లో తమ ఉనికిని దీర్ఘకాలం ఉంచుకోవాలని భావిస్తున్నాం. ఈ జాయింట్ వెంచర్ కింద నాగ్‌పూ ప్లాంట్ నుంచి రాఫెల్, ఫాల్కన్ 2000 పరికాలను ఉత్పత్తి చేయనున్నాం' అని వివరించారు.

రిలయన్స్ ఎంపిక మా నిర్ణయమే..
రాఫెల్ ఒప్పందం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని, స్వచ్ఛందంగానే తాము రిలయన్స్‌ను ఎంచుకున్నామని ఫ్రాన్స్ కంపెనీ డసో ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే విషయాన్ని గురువారం వెల్లడించారు. అయినా, కేంద్రంపై కాంగ్రెస, విపక్షాల విమర్శలు మాత్రం ఆగడం లేదు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications