వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia-Ukraine war: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జీ జిన్‌పింగ్ ఫోన్, చర్చలకు పిలుపు

|
Google Oneindia TeluguNews

కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఇప్పటికే రాజధానితోపాటు పలు ప్రాంతాలపై రష్యా దళాలు పట్టుసాధించాయి. ఉక్రెయిన్ ప్రతిదాడులకు దిగుతున్నప్పటికీ.. ఉక్రెయిన్ బలగాలను అణిచివేసుకుంటూ ముందుకు కదులుతున్నాయి రష్యా దళాలు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఫోన్ చేశారు.

ఉక్రెయిన్‌లో కొన‌సాగుతున్న సంక్షోభ ప‌రిస్థితుల‌పై పుతిన్‌తో జిన్‌పింగ్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్‌కు ఆయన సూచించారు. దీనికి పుతిన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఉక్రెయిన్‌తో తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపినట్లు సమాచారం.

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని దండయాత్ర అని విదేశీ మీడియా అనడాన్ని చైనా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. రష్యా దాడిని దండయాత్ర అనడం కరెక్ట్ కాదని కూడా చెప్పింది. ఉక్రెయిన్ పై రష్యా దాడికి పరోక్షంగా మద్దతు తెలిపిన డ్రాగన్.. ఇప్పుడు చర్చలు జరపాలంటూ సూచించడం గమనార్హం. అయితే, చర్చలు జరిపేందుకు సిద్ధమన్న వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్ మొదట ప్రతిదాడులు ఆపేయాలన్నారు. ఉక్రెయిన్ మిలిటరీ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

 Russia-Ukraine war: Ready to negotiate with Ukraine, Putin Tells Xi Jinping

మా ఎదురుదాడుల్లో 1000 మందికిపైగా రష్యా సైనికులు మృతి చెందారు: ఉక్రెయిన్

గత రెండ్రోజుల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఉక్రెయిన్ వెనక్కి తగ్గకుండా ఎదురుదాడిని కొనసాగిస్తోంది. ఓ వైపు భారీ నష్టం జరుగుతున్నా.. రష్యా బలగాలను ఎదుర్కొంటోంది. కాగా, ఈ ఘర్షణలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

రష్యా దాడులు ప్రారంభించిన నాటి నుంచి ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదని పేర్కొంది. గురువారం తెల్లవారుజామున దాడి ప్రారంభమైనప్పటి నుంచి 137 మంది ఉక్రేనియన్లు, సైనిక సిబ్బంది, పౌరులు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.

అంతకుముందు గురువారం, రష్యా తమ సైన్యం ఉక్రెయిన్‌లోని 11 ఎయిర్‌ఫీల్డ్‌లతో సహా 70కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసిందని పేర్కొంది. ఉక్రెయిన్ నల్ల సముద్రపు ఓడరేవు నగరం ఒడెస్సా సమీపంలోని సైనిక స్థావరం వద్ద గురువారం జరిగిన ఘోరమైన ఒకే ఒక్క దాడిలో 18 మంది మరణించారు.

రష్యాతో కొనసాగుతున్న వివాదం మధ్య, యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధ వ్యతిరేక సంకీర్ణానికి విజ్ఞప్తి చేశారు. సమర్థవంతమైన అంతర్జాతీయ సహాయం కోసం Zelenskyy పిలుపునిచ్చారు. చర్చల పట్టికలో రష్యాను ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తన పోలిష్ కౌంటర్ ఆండ్రెజ్ డుడాతో ఇదే విషయాన్ని చర్చించినట్లు చెప్పారు. "రక్షణ సహాయం, ఆంక్షలు, దురాక్రమణదారుపై ఒత్తిడి కోసం బుకారెస్ట్ నైన్‌కు విజ్ఞప్తి చేశారు," అన్నారాయన. ఉక్రెయిన్ అధ్యక్షుడు.. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో కూడా కొనసాగుతున్న సంక్షోభంపై చర్చించారు.

"మేము రష్యన్ ఫెడరేషన్‌కు సమర్థవంతమైన ప్రతిఘటనను డిమాండ్ చేస్తున్నాము. ఆంక్షలు మరింత బలోపేతం కావాలి" అని మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రాశారు.
కాగా, ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఖండించడమే కాకుండా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడుకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు పెరుగుతున్నాయి.

English summary
Russia-Ukraine war: Ready to negotiate with Ukraine, Putin Tells Xi Jinping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X