వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవులను కృత్రిమ మేథస్సు అధిగమించేస్తుందేమో: స్టీఫెన్ హాకింగ్ ఆందోళన

టెక్నాలజీ అభివృద్ధితో దూసుకుపోయేందుకు మానవుడు అవలంభిస్తున్న దుందుడుకు చర్యల వల్ల భవిష్యత్తులో అణు, బయోలాజికల్ యుద్ధాలు తప్పవని, సాంకేతికతతో మనకు ముప్పు అని ప్రముశ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరి

|
Google Oneindia TeluguNews

లండన్: టెక్నాలజీ అభివృద్ధితో దూసుకుపోయేందుకు మానవుడు అవలంభిస్తున్న దుందుడుకు చర్యల వల్ల భవిష్యత్తులో అణు, బయోలాజికల్ యుద్ధాలు తప్పవని, సాంకేతికతతో మనకు ముప్పు అని ప్రముశ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు.

ఈ ముప్పును తప్పించగలిగేది కేవలం వరల్డ్ గవర్నమెంట్ మాత్రమేనని చెప్పారు. భూతాపం, అనేక జాతుల అంతరించి పోవడం, కృత్రిమ మేధస్సుతో కలిగే ముప్పు వంటివి ప్రపంచాన్ని భయపెడుతున్నప్పటికీ భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వరల్డ్ గవర్నమెంటును ఏర్పరచుకుంటే అది ముప్పును ముందుగానే గుర్తిస్తుందన్నారు. మన దుందుడుకు వైఖరి, సాంకేతిక పురోగమనంలో చోటు చేసుకుంటున్న వేగం తోడై పెనుముప్పును తెచ్చిపెడుతున్నాయని, దీంతో మానవాళి మొత్తం అణ్వస్త్ర, జీవాయుధ యుద్ధంలో నాశనమయ్యే ప్రమాదముందన్నారు.

భవితపై ఆశాజనకంగానే హాకింగ్

భవితపై ఆశాజనకంగానే హాకింగ్

సామూహిక అంతర్థానాలు, భూతాపం, కృత్రిమ మేధస్సు ముప్పులు పొంచి ఉన్నప్పటికీ మానవాళి భవితపై తాను ఆశాజనకంగానే ఉన్నానని స్టీఫెన్ హాకింగ్‌ చెప్పడం గమనార్హం.

ఆ నైపుణ్యాలు మన వద్ద లేవు

ఆ నైపుణ్యాలు మన వద్ద లేవు

ఓసారి వెనుదిరిగి, గడిచిపోయిన నా జీవితాన్ని కృతజ్ఞతాభావంతో చూసుకుంటున్నానని, రాబోయే కాలాన్ని మాత్రం అప్రమత్తతతో కూడిన ఆశతో చూస్తున్నానని స్టీఫెన్ తెలిపారు. ఒక జాతిగా సజీవంగా ఉండేందుకు అవసరమైన నైపుణ్యాలు మానవుల వద్ద లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ ప్రభుత్వం ఏర్పడాలి

ప్రపంచ ప్రభుత్వం ఏర్పడాలి

భవిష్యత్‌లో మానవాళి మనుగడ సాగించాలంటే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఇలాంటి ముప్పులను గుర్తించి, చర్యలకు ఉపక్రమించడంలో మనం వేగంగా ఉండాలని, లేకుంటే పరిస్థితులు చేయి దాటిపోతాయన్నారు. ఏదో ఒక రూపంలో ప్రపంచ ప్రభుత్వం ఏర్పాటు కావాలని, అయితే అది నిరంకుశంగా మారే ప్రమాదముందన్నారు.

అదే దుందుడుకు మనకు నష్టదాయకం

అదే దుందుడుకు మనకు నష్టదాయకం

నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి దూకుడు వైఖరి అనేది మానవ మనుగడకు సాయపడిందని హాకింగ్‌ చెప్పారు. పరిణామక్రమంలో ఆ వైఖరి మన జన్యువుల్లో బలంగా నిక్షిప్తమైపోయిందని, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పురోగతి వచ్చిపడటం వల్ల అదే దుందుడుకు వైఖరి మనకు నష్టదాయకంగా మారనుందన్నారు.

కృత్రిమ మేథస్సు అధిగమిస్తుందేమో

కృత్రిమ మేథస్సు అధిగమిస్తుందేమో

దీనివల్ల అణు, జీవాయుధ యుద్ధంలో మనమంతా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉందని స్టీఫెన్ హాకింగ్ అన్నారు. పర్యావరణ సమస్యలు సహా అనేక కొత్త సవాళ్లు కూడా ఉన్నాయన్నారు. మానవులను కృత్రిమ మేధస్సు అధిగమించేస్తుందన్న ఆందోళన తనకు ఉందని చెప్పారు.

English summary
Stephen Hawking thinks rapid technological advances, coupled with humanity's naturally aggressive instincts, could ultimately threaten the human race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X